Begin typing your search above and press return to search.
పవన్ అల్టిమేటంకు సీఎం స్పందించరా?
By: Tupaki Desk | 25 May 2018 6:19 AM GMTఏరు దాటే వరకు ఏరు మల్లన్న...ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారం. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేసిన జనసేనాని పవన్ ను చంద్రబాబు మొన్న మొన్నటి వరకు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు.
మిత్రధర్మం ప్రకారం....పవన్ లేవనెత్తిన సమస్యలపై సత్వరం స్పందించేవారు. స్వయంగా చంద్రబాబే ప్రెస్ మీట్ పెట్టి మరీ జవాబుదారీగా ఉండేవారు. ఒకవేళ టీడీపీ నేతలెవరైనా పొరపాటున పవన్ ను విమర్శించినా...వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. పైగా, పవన్ ప్రభుత్వాన్ని సహేతుకంగా ప్రశ్నిస్తున్నారని....మోసేవారు. ఇదంతా గతం. జనసేన ఆవిర్భావ దినోత్సవంనాడు చంద్రబాబు, లోకేష్ లపై పవన్ విమర్శనాస్త్రాలు మొదలెట్టినప్పటి నుంచి సీన్ మారిపోయింది. పవన్ పై చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల విమర్శల జడివాన మొదలైంది. ఇపుడు పవన్ ప్రశ్నిస్తే చంద్రబాబు స్పందించడం మాట దేవుడెరుగు....ఆయన మంత్రులతో పవన్ పై కౌంటర్లు వేయిస్తున్నారు. తాజాగా `ఉద్ధానం` సమస్యపై చంద్రబాబుకు 48 గంటల డెడ్ లైన్ విధించిన పవన్ డిమాండ్ పై చంద్రబాబు స్పందించలేదు. అంతేకాకుండా, ఉద్ధానం సమస్యను పవన్ రాజకీయం చేస్తున్నారంటూ హోంమంత్రి చినరాజప్ప ....పవన్ పై ప్రతివిమర్శలకు దిగారు. తాము ఉద్ధానం కోసం పాటుపడుతున్నామని, విమ్స్ లో పరిశోధన కేంద్రం ప్రారంభం అయిందని, ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షిత మంచి నీటి సరఫరా జరుగుతోందని.. వైద్య పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు.
ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యపై మానిటరింగ్ టీం ను ఏర్పాటు చేయాలని, 48గంటల్లోగా వైద్యశాఖకు మంత్రిని నియమించకపోతే తాను 24 గంటలపాటు నిరాహార దీక్షకు దిగుతానని చంద్రబాబుకు పవన్ అల్టిమేటం ఇచ్చారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు నుంచి స్పందన రాలేదు. మరోవైపు, అభిమానులకు పవన్ బౌన్సర్లకు మధ్య జరిగిన తోపులాటలో ఇరు వర్గాలు గాయపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బౌన్సర్లు లేని కారణంగా నిన్న, నేడు పవన్ పర్యటన వాయిదా పడింది. దాదాపుగా రేపు కొత్త బౌన్సర్లు శ్రీకాకుళం చేరుకోవచ్చని తెలుస్తోంది. అందుకే, సాయంత్రం వరకు చంద్రబాబు స్పందన కోసం వేచి చూసి....రేపు నిరాహార దీక్షపై కార్యచరణ ప్రకటించే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తన ప్రకటన పట్ల చంద్రబాబు స్పందించే అవకాశాలు లేనందును పవన్ టెక్కలిలో బసచేసిన రిసార్ట్ నుంచే నిరాహార దీక్షకు దిగాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ లోపు చంద్రబాబు స్పందిస్తారా? స‌్పందించకుంటే....పవన్ రేపు నిరాహార దీక్ష చేస్తారా? అన్న విషయంపై సందిగ్ధత ఏర్పడింది.