Begin typing your search above and press return to search.
ఆ లేఖంటే బాబుకు భలే భయం!
By: Tupaki Desk | 9 Nov 2017 4:11 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టేబుల్ మీద ఉండే ఫైళ్లలో ఒక లేఖ ఉంటుంది. ఆ లేఖను చూస్తే చంద్రబాబునాయుడుకు భలేభయం. ఆ లేఖ విషయంలో ముట్టుకుంటే షాక్ కొడుతుందేమో అని ఆయన అనుకుంటూ ఉంటారు... అంటూ పార్టీలోనే కొందరు నాయకులు రకరకాలుగా జోకులు వేసుకుంటున్నారు. ఆ లేఖను తన టేబుల్ మీది నుంచి క్లియర్ చేయడానికి ఆయన మీనమేషాలు లెక్కిస్తూ గడిపేస్తున్నారు. కానీ తమాషా ఏంటంటే.. ఆయన ఆ లేఖను క్లియర్ చేయడం అనే అంశం మీద తెలంగాణ రాజకీయాలు ఆధారపడి ఉండడం. ఇంతకూ ఆ లేఖ ఏంటో తెలుసా? అదే రేవంత్ రెడ్డి రాజీనామా.
రేవంత్ రాజీనామా లేఖను పుచ్చుకోవాల్సిన వ్యక్తి. ఎమ్మెల్యే పదవిని వదులుకుంటూ రాసిన లేఖ అది. తెలంగాణ శాసనసభ స్పీకరును ఉద్దేశించి రాశారు. పైగా రేవంత్ రెడ్డి ఎలాంటి శషబిషలు లేకుండా - డొంకతిరుగుడు పద్ధతులకు పోకుండా.. స్ట్రెయిట్ గా స్పీకర్ ఫార్మాట్ లేఖను రాశారు. ‘టూ అడ్రస్’ ఉన్న చిరునామాకు ఈ లేఖ చేరిందంటే గనుక.. అతి స్వల్ప వ్యవధిలోనే ఆయన పదవి పోయే ప్రమాదం ఉంటుంది. అయితే చంద్రబాబు టేబుల్ మీదినుంచి కదలడానికి ఆ లేఖ మొరాయిస్తున్నట్లుగా ఉంది.
ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు నాయుడు తీసుకోగల నిర్ణయం గురించి మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబునాయుడు వెంటనే ఆ లేఖను స్పీకరుకు పంపేస్తే.. రేవంత్ మాజీ అవుతారు. ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. మళ్లీ నెగ్గడం అనేది రేవంత్ రెడ్డికి అత్యవసరం అవుతుంది. అదే సమయంలో.. అధికార తెరాస కూడా... పట్టుదలగా ఆయనను ఓడించడానికి ట్రై చేస్తుంది. ఓడితే గనుక.. కాంగ్రెస్ లో ఆయన హవాకు ఆదిలోనే కత్తెర పడుతుంది. వీటన్నింటినీ మించి.. ఉప ఎన్నిక అంటూ వచ్చినట్లయితే గనుక.. రేవంత్ రెడ్డి ఇలాంటి క్లిష్ట సమయంలో.... కోట్లాది రూపాయల అదనపు వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. మరి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏం చేయబోతున్నారు.
చాలా మంది భావిస్తున్నది ఏంటంటే.. తన మీదకు నింద రాకుండా ఆయన ఆ లేఖను తె-స్పీకరుకు పంపుతారు. కాకపోతే.. అందుకు మరికొన్ని నెలల సమయం అవసరం అవుతుంది. అప్పుడు ఆయన రాజీనామాను ఆమోదించినా కూడా ఉప ఎన్నిక రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా.. రేవంత్ కు రాజీనామా చేసిన క్రెడిబిలిటీ మిస్ కాకుండా - అలాగని ఉప ఎన్నికల భారం పడకుండా.. చంద్రబాబునాయుడు తోడ్పాటు - సహకారం అందిస్తారన్నమాట. అందుకు ప్రత్యుపకారంగా రేవంత్ ఎలాంటి సహకారం అందించాలో ఎవరికి వారు ఊహించుకోవచ్చు.