Begin typing your search above and press return to search.
చంద్రబాబు అక్కడికొచ్చి 50 రోజులు దాటింది
By: Tupaki Desk | 29 Oct 2015 7:49 AM GMTఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక హైదరాబాద్ లో సచివాలయానికి రారా.. విజయవాడకే పరిమితమైపోతారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఆయన సచివాలయానికి వచ్చి ఇప్పటికి 53 మూడు రోజులయింది. సెప్టెంబర్ 5న జరిగిన మంత్రివర్గ భేటీ తరువాత మళ్లీ ఆయన సచివాలయానికి రాలేదు. ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ 4 వరకు జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రతి రోజూ సచివాలయానికి వచ్చారు. ఆ వెంటనే 5వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. అదే ఆయన చివరి సారిగా సచివాలయానికి రావడం. ఆ తరువాత విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నా సచివాలయంలో మాత్రం కాలు పెట్టడంలేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులతో మాట్లాడేందుకు కొన్నిసార్లు, కెసిఆర్ కు ఆహ్వానం పలికేందుకు ఒకసారి, విశ్రాంతి కోసం ఒకసారి ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పటికీ సచివాలయంవైపు మాత్రం రాలేదు.
ఏపీ పాలన విజయవాడ నుంచే కొనసాగిస్తానని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఇక హైదరాబాద్ లోని సచివాలయానికి రావడం కష్టమేనని అంటన్నారు. దాదాపు రెండు నెలలుగా ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోవడం, అధికారులు కూడా వారానికి నాలుగైదు రోజులపాటు విజయవాడలోనే ఉంటుండడంతో ఇక్కడి సచివాలయ పాలనపై ప్రభావం పడుతోంది. ఫైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెబుతున్నారు.