Begin typing your search above and press return to search.
ఆనం బ్రదర్స్ అల్ప సంతోషులా కాదా?
By: Tupaki Desk | 9 Aug 2017 4:47 PM GMTఇప్పుడిప్పుడే కాస్త గాడిన పడుతుందనుకుంటున్న నెల్లూరు టీడీపీకి మరో గట్టి షాక్ తగలకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్ ను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు వైసీపీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న సంగతి పసిగట్టిన చంద్రబాబు ఆ పరిస్థితి రాకుండా వారిని బుజ్జగించే చర్యలు చేపడుతున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతను వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఆనం బ్రదర్స్ తమలో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ పదవి దక్కితే చాలనుకుని టీడీపీలో చేరారు. అయితే... వాళ్ల ప్రత్యర్థి సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కిందే కానీ ఆనం సోదరులకు చంద్రబాబు ఏ పదవీ ఇవ్వలేదు. ఈ నిర్లక్ష్యాన్ని ఆనం రామనారాయణ రెడ్డి భరించినా ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి మాత్రం సహించలేకపోయారు. పలుమార్లు ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ పార్టీ మారే అవకాశం ఉందని నెల్లూరు జిల్లాలో కొంతకాలంగా ప్రచారం ఊపందుకుంది. దీంతో నెల్లూరు జిల్లాలో పార్టీ పట్టునిలుపుకోవాలంటే వారిద్దరూ చేజారకుండా ఉండడం ముఖ్యమని భావించిన చంద్రబాబు వారికి ప్రాధాన్యం పెంచనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు గాను తన కలల ప్రాజెక్టు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్ - ప్లానింగ్ లో దిట్టగా పేరుతెచ్చుకున్న ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రన్న బీమా - హౌసింగ్ ప్రాజెక్టులు బాధ్యత అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ తో వారు పార్టీ మారకుండా ఆగుతారని చంద్రబాబు అనుకుంటున్నారనట. మరి ఆనం బ్రదర్స్ ఇలాంటి పేరు గొప్ప పదవులతో సరిపెట్టుకుంటారా అన్నది చూడాలి.