Begin typing your search above and press return to search.
డైరెక్టర్ క్రిష్ పై చంద్రబాబు మనసు..
By: Tupaki Desk | 17 Jan 2017 10:17 AM GMTఏపీ రాజధాని అమరావతి నిర్మాణం సినిమాటిక్ గా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడు ఏం తోస్తే అదే చేస్తానంటున్నట్లుగా ఉంటోంది. మలేషియా - సింగపూర్ డిజైన్ల కోసం రెండున్నరేళ్లు గడిపేసిన సీఎంగారు ఇటీవలే బాహుబలి సినిమాను చూసి మనసు మార్చుకున్నారు. బాహుబలి సెట్టింగ్ ల తరహాలో రాజధాని డిజైన్ ఉండాలంటూ నేరుగా రాజమౌళి దగ్గరకు అధికారులను పంపించారు. అమరావతి డిజైన్ రూపకల్పనలో రాజమౌళి సలహాలు తీసుకోవాలని భావించారు. అయితే బాహుబలి-2 నిర్మాణంలో బిజీగా ఉన్న రాజమౌళి ఇప్పట్లో తనకు వీలు కాదని… కొద్ది కాలం తర్వాత డిజైన్ల రూపకల్పనలో సాయం చేస్తానని చెప్పారు. దీంతో కొద్ది రోజులు ఆగాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది.
ఇంతలో మురో భారీ సెట్టింగుల సినిమా వచ్చింది. తన బావమరిది బాలకృష్ణ నటించిన శాతకర్ణి సినిమాలోని గ్రాఫిక్స్‌పై చంద్రబాబు మనసు మళ్లింది. శాతకర్ణి సినిమా తరహాలో రాజధాని డిజైన్ ఉండాలని బాబు భావిస్తున్నారట. ఇందుకోసం దర్శకుడు క్రిష్ నుంచి రాజధాని డిజైన్‌కు సలహాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట.
నిజానికి చంద్రబాబు తొలుత బోయపాటి శ్రీనివాస్ ను నమ్ముకున్నారు. పుష్కరాల టైంలో బోయపాటే కీలకంగా వ్యవహరించారు. తరువాత రాజమౌళిపై మనసు పడ్డారు. ఇప్పుడు క్రిష్ వైపు చూస్తున్నారు. వాస్తవాలను వదిలి కల్పనలవైపు అడుగులు వేస్తున్న చంద్రబాబు చివరికి అమరావతి విషయంలో సినిమా చూపించడం ఖాయంగా కనిపిస్తోందని విపక్షాలు అంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/