Begin typing your search above and press return to search.

చెడ్డపేరు వచ్చాక సంచలన నిర్ణయమా బాబు..? 1

By:  Tupaki Desk   |   27 Feb 2016 5:28 AM GMT
చెడ్డపేరు వచ్చాక సంచలన నిర్ణయమా బాబు..? 1
X
విభజనతో విలవిలలాడిన ఏపీ ప్రజలంతా టీడీపీ అధినేత చంద్రబాబు మీద చాలానే నమ్మకం పెట్టుకున్నారు. బాబు వస్తే చాలు.. తనకున్న తెలివితేటలతో మొత్తంగా ఏపీ పరిస్థితినే మార్చేస్తారన్న నమ్మకంతో అధికారాన్ని ఆయనకు అప్పజెప్పారు. పదేళ్లుగా పవర్ కు దూరంగా ఉన్న ఆయన చేతికి అధికారం కానీ వస్తే.. బాబు తీసుకునే నిర్ణయాలన్నీ జనరంజకంగా ఉంటాయని ఆశించారు.

అయితే.. పదేళ్ల వ్యవధిలో జనం మైండ్ సెట్ లో వచ్చిన మార్పుల్ని పెద్దగా పట్టించుకోని చంద్రబాబు కారణంగా.. ఏపీ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు లేని పరిస్థితి. రియల్ ఎస్టేట్ తో పాటు.. నిర్మాణ అవసరాలకు ఎంతో కీలకమైన ఇసుక విషయంలో ప్రజల సమస్యల్ని తీర్చేలా నిర్ణయం తీసుకుంటారని భావించారు. అలాంటిదేమీ లేకపోగా.. ఈ వ్యవహారంలో కంగాళీగా వ్యవహరించిన బాబు సర్కారు నిర్ణయంతో గందరగోళం చోటు చేసుకుంది.

తొలుత ఇసుక రీచ్ లను వేలం వేయటం.. తర్వాత నిషేధం విదించటం లాంటివి చేశారు. దీంతో ఇసుక బంగారంగా మారి.. వాటి ధరలు నింగికి ఎగిశాయి. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇది బాబు సర్కారు మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేలా చేసింది. మధ్యతరగతి వారైతే.. పెరిగిన ఇసుక ధరలతో బాబు సర్కారును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పరిస్థితి. రూ.10లక్షలతో నిర్మాణం పూర్తి అవుతుందని లెక్కలేసుకుంటే.. పెరిగిన ఇసుక ధర కారణంగా అది రూ.12 నుంచి రూ.13లక్షలకు పెరిగిన దుస్థితి. ఒకదశలో ఇసుక కారణంగా ఏపీ ప్రజల్లో బాబు సర్కారును.. ఇదెక్కడి ప్రభుత్వం రా అని అనేవరకూ సీమాంధ్రులు ఫీలయ్యారు.

ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇసుక వ్యవహారాన్ని డ్వాక్రా సంఘాల వారికి అప్పజెప్పారు. అయినప్పటికీ ఏపీ సర్కారుకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. అధికారపార్టీకి చెందిన నేతల కారణంగా ఇసుక ధర విషయంలో పెద్ద మార్పులు రాని పరిస్థితి. చాలా చోట్ల అధికార.. విపక్ష నేతలు కలిసిపోయి దోచుకున్న చేదు నిజం కాస్త ఆలస్యంగా బాబు దృష్టికి వెళ్లింది.