Begin typing your search above and press return to search.

చంద్రబాబు కౌంటరేశారా.. జోకేశారా?

By:  Tupaki Desk   |   24 Feb 2018 5:28 PM GMT
చంద్రబాబు కౌంటరేశారా.. జోకేశారా?
X

చంద్రబాబు పేరెత్తితే ఒంటికాలిపై లేచే ప్రత్యర్ధులు కూడా ఆయన రాజకీయ చాణక్యానికి.. ఎత్తుగడలకు ఫిదా అవుతుంటారు. అంతేకాదు.. ఆయనపై విమర్శలు చేసేవారు - ఆయన్ను ఇరుకునపెట్టే ఎత్తుగడలు వేసేవారు కూడా తిరిగి ఆయన్నుంచి అంతకుమించిన రివర్స్ అటాక్ ఉంటుందని అలర్ట్ గా ఉంటారు. కానీ..తాజాగా ఏపీ బీజేపీ చంద్రబాబును ఇరుకునపెట్టేలా వేసిన ఒక ఎత్తుగడపై మాత్రం ఆయన సిల్లీగా స్పందించారు. ఏమాత్రం బలమైన రివర్స్ అటాక్ ఇవ్వకపోగా ఒకరకమైన నిస్సహాయమైన స్థితిలో తలాతోకా లేని రివర్స్ అటాక్ కు దిగారు.

నిన్న ఏపీ బీజేపీ నేతలు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై చంద్రబాబు స్పందించారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని.. రాష్ట్రానికి రెండో రాజధానిని సీమలో ఏర్పాటు చేయాలని బీజేపీ తన డిక్లరేషన్ లో పేర్కొన్న నేపథ్యంలో చంద్రబాబు... కర్నూలులో సుప్రీంకోర్టు బెంచి ఏర్పాటు చేయాలని, అమరావతిని దేశానికి రెండో రాజధాని చేయాలని బీజేపీని ఆయన డిమాండు చేశారు. అప్పుడు బీజేపీ చిత్తశుద్దిని తాము నమ్ముతామని అన్నారు.

కాగా చంద్రబాబు ఈ మాటలను వెటకారంగా అన్నప్పటికీ కూడా ఆయన తరహా వ్యాఖ్యలు కావని - ఏమీ అనలేక ఆయన ఇలాంటి రివర్స్ అటాక్ కు దిగారని అంటున్నారు. బీజేపీ వేసిన ఈ స్కెచ్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకే ఆయన ఇలా ఫ్రస్టేషన్లో ఇలా మాట్లాడుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. కాగా.. బీజేపీ దెబ్బకు చంద్రబాబుకు తాను రాయలసీమకు ఏమేం చేశానో చెప్పడం మొదలుపెట్టారు. రాయలసీమను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని.. కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీరు అందించామని తెలిపారు. తాను కూడా రాయలసీమ బిడ్డనే అని చెప్పారు. బీజేపీకి ఇప్పుడు రాయలసీమ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించిన ఆయన... రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.