Begin typing your search above and press return to search.
బాబు క్వశ్చన్!... నాపై కేసులు పెడతారా?
By: Tupaki Desk | 22 March 2018 11:01 AM GMTదేశంలో జరిగే ప్రతి పనిపై నిష్పాక్షికంగా సమీక్ష నిర్వహించే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏటా ఆయా పనులపై నివేదికలు ఇవ్వడం సర్వ సాధారణం. అధికారంలో ఉన్న పార్టీలు ఆ నివేదికలను తప్పుబట్టడం, అవే పార్టీలు ప్రతిపక్షంలో ఉంటే కాగ్ రిపోర్టులను ఆధారం చేసుకుని అధికార పార్టీలపై విరుచుకుపడటం మనకు కొత్తేమీ కాదు. అంటే... అధికార పార్టీలకు కాగ్ శత్రువుగా కనిపిస్తుండగా, విపక్షాలకు మాత్రం మిత్రుడిగా కనిపిస్తోందన్న మాట. అలాంటి కాగ్ రిపోర్టులను చూసి భయపడే రాజకీయ నేతలు పెద్దగా ఉండరనే చెప్పాలి. అలాగని కాగ్ రిపోర్టులు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావా? అంటే... అదేమీ లేదు గానీ... ఆయా వ్యవహారాల్లో జరిగిన అవకతవకలను కాగ్ రిపోర్టు అక్షరం పొల్లు పోకుండా ఎత్తి చూపుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ రిపోర్టుల్లోని అంశాలను ఆధారం చేసుకుని రాజకీయ పార్టీలు చేసే రచ్చే.. రిపోర్టుల్లోని వాస్తవాలను మరుగున పడేస్తోందని చెప్పాలి. కాగ్ రిపోర్టులను చూసి జడుసుకునే నేతలు చాలా మందే ఉన్నా... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు లాంటి *40 ఇయర్స్ ఇండస్ట్రీ* అని చెప్పునే నేతలు పెద్దగా భయపడరనే చెప్పాలి. అయితే తాజాగా విడుదలైన కాగ్ రిపోర్టు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు నిదర్శనం... నేటి ఉదయం ఏపీ అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగమేనన్న మాట వినిపిస్తోంది.
అయినా అసెంబ్లీలో చంద్రబాబు ఏం మాట్లాడారన్న విషయానికి వస్తే.. *పట్టిసీమపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా కేసులు పెడతారా? నిన్నటివరకు మా ప్రభుత్వంపై కన్పించని అవినీతి ఇప్పుడెలా కన్పించింది? పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కుట్రలు పన్నుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొనేందుకే ఇవన్నీ చేస్తున్నారు. రాష్ట్రంపై ఉద్దేశ్యపూర్వకంగానే ఆరోపణలు చే.స్తున్నారు. పోలవరంతో పాటు పురుషోత్తమపట్నం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడ కాగ్ రిపోర్ట్‌లో అనేక తప్పులను ఎత్తి చూపుతోంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మోడీ ప్రభుత్వంపై కూడ కేసులు వేస్తారా? ఇంతకాలం పాటు మా ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయని బీజేపీ నేతలు ఇప్పడే ఎందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు? పోలవరం కాంట్రాక్టర్‌ను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంపిక చేసింది* అని బాబు చెప్పారు.
* మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన నవయుగ కంపెనీకి నేను వత్తాసు పలుకుతున్నానని సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రమే నమయుగ కంపెనీకి ఈ పనులను అప్పగించింది. పోలవరం పునరావాసంపై పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కూడ ఇదే తరహాలో ప్రజలను రెచ్చగొట్టారు. ఏపీలోని16 ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. కుప్పం నియోజకవర్గానికి కంటే ముందుగానే పులివెందుకు నీళ్ళిచ్చాం. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఏపీకి నిధులు ఇచ్చారు. విభజన చట్టంలో పొందుపర్చిన హమీలను అమలు చేశారా?* అంటూ చంద్రబాబు తనదైన స్టైల్లో ప్రసంగించేశారు. మొత్తంగా ఈ ప్రసంగంలో కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించినట్లుగానే కనిపిస్తున్నా... పట్టిసీమలో జరిగిన అవినీతి ఆధారంగా తనపై ఎక్కడ కేసులు పెడతారోనన్న భయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.