Begin typing your search above and press return to search.

ప‌దిసార్లు వెళ్లినా బాబుకు కొత్తేనంట‌!

By:  Tupaki Desk   |   21 Jan 2016 1:33 PM GMT
ప‌దిసార్లు వెళ్లినా బాబుకు కొత్తేనంట‌!
X
స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో జ‌రుగుతున్న‌న ఆర్థిక స‌ద‌స్సుకు దేశం నుంచి ఒకే ఒక్క ముఖ్య‌మంత్రి హాజ‌రవుతున్న సంగ‌తి తెలిసిందే. స‌ద‌స్సుకు హాజ‌రైన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భార‌త‌కాల‌మానం ప్ర‌కారం గురువారం ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర అంశాల్ని చెప్పుకొచ్చారు. తాను దావోస్ లో జ‌రిగిన స‌ద‌స్సుల్లో ప‌దింటికి వ‌చ్చాన‌ని.. వ‌చ్చిన ప్ర‌తిసారీ కొత్త విష‌యాల్ని తెలుసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

పెట్టుబ‌డిదారుల్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన చంద్ర‌బాబు.. ఏపీలో స‌హ‌జ వ‌న‌రులు.. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు.. స‌ముద్ర తీర ప్రాంతం. నైపుణ్యం క‌లిగిన మాన‌వ‌వ‌న‌రులు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధి రేటు అద్భుతంగా ఉంద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఉపాధి అవ‌కాశాల్ని పెంచామ‌న్నారు. అభివృద్ధి కోసం నిధులు త‌ప్ప‌నిస‌రి ఏమీ కాద‌ని.. నిధులు అవ‌స‌రం లేకుండానే తాము సైబ‌రాబాద్‌ ను.. హైద‌రాబాద్‌ ను అభివృద్ధి ప‌రిచిన విష‌యాన్ని గుర్తు చేశారు.

వెళ్లిన ప్ర‌తిసారీ కొత్త విష‌యాల్ని తెలుసుకుంటున్న‌ట్లు చెప్పిన చంద్ర‌బాబు.. మ‌రి.. తాజా ప‌ర్య‌ట‌న‌ల నుంచి నేర్చుకున్న కొత్త అంశాలు ఏపీకి ఏ విధంగా సాయంగా నిలుస్తాయో చూడాలి.