Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు ఏమైంది.?
By: Tupaki Desk | 3 April 2019 5:21 AM GMT2019 ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదని చంద్రబాబుకి అర్థమైందా.? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి అధికారం దక్కదనే విషయం ఆయనకు తెలిసిపోయిందా..? అంటే ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు ప్రసంగాల్ని గమనిస్తే.. ఆయన మాటల్లో చాలా తేడా వచ్చింది. ఎన్నికల ప్రచారం మొదలైన కొత్తలో చంద్రబాబు మనదే తిరిగి అధికారం అనేవారు. కానీ ఇప్పుడు ఆయన మాటల్లో తేడా వచ్చేసింది. టీడీపీని మళ్లీ గెలిపించుకోవాలని ఆయన ప్రజల్ని కోరుతున్నాడు. అన్నింటికి మించి తనకు మరోసారి అవకాశం ఇస్తే.. ఏపీ అభివృద్ధి జరుగుతుందని లేదంటే రాష్ట్రం రౌడీలపాలు అయిపోతుందని సైకలాజికల్ గా బెదిరిస్తున్నారు.
మరోవైపు.. మోదీని టార్గెట్ చేస్తూ నిన్న చిత్తూరు జిల్లాలో కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. తనకు భార్య - కొడుకు - కోడలు - మనవడు ఉన్నాడని చెప్పారు చంద్రబాబు. తనకు అధికారం రాకపోతే.. ఇంట్లో ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తానన్న చంద్రబాబు.. మోడీకి ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు. అన్నింటికి మించి తన కన్నతల్లిని మొన్నటివరకు చూసుకున్నానని.. కానీ కన్నతల్లిని కూడా మోదీ పట్టించకోవడం లేదని విమర్శించారు. తనక డబ్బులు అవసరం లేదని.. తనకి చక్కని కుటుంబం ఉందని చెప్పారు. చూస్తుంటే.. ఈసారి అధికారం రావడం కష్టమే అన్న విషయం చంద్రబాబుకి తెలిసిపోయినట్లుంది.