Begin typing your search above and press return to search.
ఈవీఎంలు - బాబు.. ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ
By: Tupaki Desk | 17 Dec 2018 10:23 AM GMTతాము చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టు టీడీపీ నేతల పరిస్థితి ఉంది. చంద్రబాబు తాజాగా కరుణానిధి విగ్రహావిష్కణలో పాల్గొని చెన్నైలో ఓ హాట్ కామెంట్ చేశారు. ‘రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలువాలనుకుంటోంది’ అని దుమ్మెత్తిపోశారు.
నిజానికి చంద్రబాబుకు హైటెక్ బాబుగా పేరుంది. ఆయనకు తెలిసినంతగా టెక్నాలజీ ఎవ్వరికీ తెలీదు.. వాడుకోవడంలోనే ఆయన తర్వాత ఎవ్వరైనా.. ఇదే పెద్దమనిషి 2014లో మోడీతో చెట్టాపట్టాలేసుకొని బీజేపీతో కలిసి పోటీచేసి ఏపీలో గెలవగానే.. ఈవీఎంల గురించి.. వాటి పనితీరు గురించి గొప్పగా చెప్పాడు. ఇప్పుడేమో అదే బీజేపీని ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. బాబు ఇప్పటి మాటలను బట్టి ఆయన 2014లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచినట్టే లెక్కా..
నంద్యాల ఉప ఎన్నికల్లోనూ చంద్రబాబు అండ్ కో ఈవీఎంలతో వద్దు బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలని వైసీపీ సహా ప్రతిపక్షాలు కోరినా పెట్టలేదు. అప్పుడు అధికార దుర్వినియోగం చేసి గెలిచారన్న విమర్శలు వచ్చాయి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలొచ్చాయి. అప్పుడు అదేం లేదన్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఎందుకు వద్దంటున్నారన్నదే ప్రశ్న..
ఇక తెలంగాణ ఎన్నికల్లో కూడా బొక్కా బోర్లా పడ్డాక కాంగ్రెస్ - టీడీపీ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అదే సమయంలో మూడు రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇలానే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచిందా అంటే సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఇలా బాబు అండ్ కో టాస్ ఎటు పడితే అలా రంగులు మార్చి బురద జల్లే రాజకీయాలను కొనసాగిస్తున్నారు. ప్రజాతీర్పును మాత్రం ఒప్పుకోవడానికి ధైర్యం చాలడం లేదు.