Begin typing your search above and press return to search.
సీమను దెబ్బకొట్టేలా హైకోర్టు విభజనకు బాబు స్కెచ్
By: Tupaki Desk | 28 Dec 2018 5:27 AM GMTఉమ్మడి హైకోర్టు విభజన - కొత్త హైకోర్టు ఏర్పాటు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉండి హఠాత్తుగా అమలుకు ఓకే చెప్పేయడం వెనుక లెక్కలు ఏంటనే సందేహంతో పాటుగా అనేక అనుమానాలు సైతం తెరమీదకు వస్తున్నాయి. హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధానిగానే కాకుండా హైకోర్టు కూడా హైదరాబాద్ లోనే కొనసాగించేందుకు రాష్ట్ర విభజన చట్టంలో వెసులుబాటు ఉన్నా ఏపీ ప్రభుత్వం ఎందుకు హైకోర్టు విభజనకు గట్టిగా అడ్డు చెప్పలేదనే ప్రశ్న తెరమీదకు వస్తోంది. హైకోర్టు భవనాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు మరో మూడు నాలుగు నెలల సమయం కావాలని నిర్మాణ కంపెనీ గడువు కోరినా హైకోర్టు విభజన చేసేందుకే చంద్రబాబు మొగ్గు చూపడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
హైకోర్టు విభజన జరిగితే...అమరావతిలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది తెలుగుదేశం ప్రభుత్వ ఉద్ధేశమని కొందరి వాదన. అయితే, దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు చేసినట్లుగా హైదరాబాద్ లో మాదిరిగా అభివృద్ధి అంతా అమరావతి చుట్టూనే చేస్తే ఎలాగనే ప్రశ్న రాయలసీమలో పదేపదే వినిపిస్తోంది. న్యాయవాదులు అయితే ఒక అడుగు ముందుకేసి రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారని సమాచారం. కీడించి మేలించాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని - పొరపాటున వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుక అధికారంలోకి వస్తే ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే ఏపీ హైకోర్టు భవన నిర్మాణం మూడు నెలల్లోగా ఏర్పాటు అవుతుందని తెలిసి కూడా అర కొర సౌకర్యాలతోనే ఏపీలో హైకోర్టుకు సమ్మతిని తెలియజేశారని అంటున్నారు.
లోక్ సభతో పాటే ఏపీ అసెంబ్లీకి మూడు నాలుగు నెలలు ముందుగా ఎన్నికలు వస్తే... ఆ పోరులో టీడీపీ కనుక అధికారంలోకి రాకపోతే.. వైసీపీకి అధికార పగ్గాలు అంది హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు అయితే...ఈ అంశాల కోణాల్లోనే చంద్రబాబు చూశారని - అందుకే హైకోర్టు విభజనను మూడు నాలుగు మాసాలు వాయిదా వేయించే ప్రయత్నం చేయలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కనుక అమరావతిలో హైకోర్టుకు అనుమతించకపోతే...మూడు నాలుగు నెలలు గడువు కోరితే.. ఈలోగా లోక్ సభతో పాటే ఏపీ అసెంబ్లీ కూడా ఎన్నికలు వచ్చేస్తాయనే భయం టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా సాక్షాత్తూ పార్టీ పెద్దల్లో కూడా పట్టుకుందని అంటున్నారు. అందుకే సివిల్ కోర్టులో హైకోర్టును తాత్కాలికంగా ఏర్పాటు చేసే చర్యలు తీసుకోకపోయినా హైకోర్టు విభజనను వాయిదా వేసేందుకు ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో హైకోర్టు ఏర్పాటు చేసి నాలుగు రోజులు పనిచేశాక.. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోగా అమరావతి సివిల్ కోర్టును తాత్కాలిక హైకోర్టుగా అన్ని మౌలిక ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది.