Begin typing your search above and press return to search.

మొత్తానికి బాబు నోటి నుంచి ఖ‌ర్చు లెక్క వ‌చ్చింది

By:  Tupaki Desk   |   1 March 2018 8:24 AM GMT
మొత్తానికి బాబు నోటి నుంచి ఖ‌ర్చు లెక్క వ‌చ్చింది
X
పాత్రికేయుల‌కు ప‌రీక్ష‌లు పెట్టే అధినేత‌లు కొంద‌రు ఉంటారు. అలాంటి వారిలో చంద్ర‌బాబు ముందువ‌రుస‌లో ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌య‌మే తీసుకుంటే.. మీడియాకుఆయ‌న టైం ఇవ్వ‌రు. ఇచ్చారంటే.. తానెందుకు టైం ఇస్తున్న‌ది.. ఆ టైంలో తానేం చెప్పాల‌నుకుంటున్నాన‌న్న విష‌యంతో పాటు.. స‌ద‌రు మీడియా సంస్థ త‌న నుంచి ఏం కోరుకుంటుంద‌న్న విష‌యాన్ని గ‌మ‌నించి.. అందుకు త‌గ్గ‌ట్లు మాట్లాడేస్తారు. ఒక‌వేళ కేసీఆర్ కు ఇష్టం లేదంటే.. ఆయ‌న అపాయింట్ మెంట్ దొర‌క‌టం సాధ్య‌మే కాదు.

కానీ.. చంద్రబాబు అలా కాదు. ఆయ‌నకు కాన్సెప్ట్ చెప్పినంత‌నే ఓకే అనేస్తారు. కానీ.. కూర్చున్న త‌ర్వాత కాన్సెప్ట్ లోకి వెళ్లేందుకు ఓ ప‌ట్టాన ముందుకు క‌ద‌ల‌రు. దీంతో.. ఆయ‌న్ను ఇంట‌ర్వ్యూ చేసే వారికి చుక్క‌లు క‌నిపిస్తూ ఉంటాయి. తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో దిగి విజ‌యంసాధించి 40 ఏళ్లు అయిన నేప‌థ్యంలో పెద్ద ఎత్తున హంగామా చేయ‌టం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా త‌న‌కు స‌న్నిహిత‌మైన మీడియా సంస్థ‌ల‌కుచెందిన ముఖ్యుల‌తో చంద్ర‌బాబు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఒక మీడియా య‌జ‌మాని తానేస్వ‌యంగా ఇంట‌ర్వ్యూ చేయ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా.. బాబును కాస్త భిన్న‌మైన కోణంలో చూపించాల‌న్న త‌ప‌న ఆయ‌న‌లోక‌నిపించింది. కానీ.. ఎంత‌కూ బాబు ఆ త‌ర‌హాలో మాట్లాడ‌క‌పోవ‌టంతో ఆయ‌న ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంద‌ని చెబుతారు.

సీరియ‌స్ గా ఉండే బాబు ను కాకుండా..కొత్త కోణంలో.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికి ప‌రిచ‌యం లేని బాబును ప‌రిచ‌యం చేయాల‌ని.. ఆయ‌న‌లో కొత్త కోణం చూపించ‌టం ద్వారా మైలేజ్ పెంచాల‌న్న ప్ర‌య‌త్నం చేసినా.. బాబు అందుకు త‌గ్గ‌ట్లు రియాక్ట్ కాక‌పోవ‌టంతో పెద్ద‌గా వ‌ర్క్ వుట్ కాలేద‌ని చెబుతారు.

అయితే.. ఆ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర అంశాలు లేక‌పోలేదు. మొద‌టిసారి చంద్ర‌బాబు పోటీ చేసిన‌ప్పుడు ఎంత ఖ‌ర్చు పెట్టార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ప్ర‌శ్న‌కు బాబు స‌మాధానం చెప్పింది లేదు. ఇదే విష‌యాన్ని స‌ర‌దాగా అడిగినా.. బాబు నోటి నుంచి సూటిగా స‌మాధానం చెప్పించ‌లేక‌పోయారు స‌ద‌రు మీడియా ప్ర‌ముఖుడు.

ఇప్ప‌టి రోజున స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కే ల‌క్ష‌లు దాటుతున్న వేళ‌.. ఎమ్మెల్యే..ఎంపీ ఎన్నిక‌లంటే కోట్లు అవ‌స‌ర‌మ‌న్న ప‌రిస్థితి.

ఇప్పుడిలాంటి ప‌రిస్థితి ఉంటే.. 40 ఏళ్ల క్రితం చంద్ర‌బాబు తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయి. అప్ప‌ట్లో బాబు ఎంత ఖ‌ర్చుచేశార‌న్న ప్ర‌శ్న‌కు సూటిగా చెప్ప‌ని బాబు.. అప్ప‌ట్లో తన తండ్రి ఖ‌ర్జుర‌నాయుడు చెరుకు పండించి.. బెల్లం అమ్మి ఇచ్చిన డ‌బ్బును ఖ‌ర్చు చేశాన‌ని.. మిగిలింది స్నేహితులు.. బంధువులు ఇచ్చిన‌ట్లుగా చెప్పారు. అంతా బాగానేఉంది కానీ.. మొత్తం క‌లిపితే ఎంత‌? అన్న ద‌గ్గ‌రే ప్ర‌శ్న ఆగిపోయింది. స‌మాధానం రాని ప‌రిస్థితి.

ఈ ప్ర‌శ్న‌ను సంధించిన‌వేళ‌లో బాబు స‌మాధానం ఎక్క‌డెక్క‌డికో వెళ్ల సాగింది. చివ‌ర‌కు ల‌క్ష వ‌ర‌కూ లెక్క తేల‌గా.. అటూ ఇటూగా రూ.89వేల వ‌ర‌కూ అయిన‌ట్లుగా చెప్పారు. ఇప్పుడు విన‌టానికిపెద్ద మొత్తంగా అనిపించ‌కున్నా.. 40 ఏళ్ల క్రితం రూ.89వేల మొత్తం అంటే భారీ మొత్త‌మే కానీ చిన్నదేమీ కాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.