Begin typing your search above and press return to search.

బాబు వ్యూహాల‌న్నీ దెబ్బేస్తున్నాయే!

By:  Tupaki Desk   |   28 March 2019 10:16 AM GMT
బాబు వ్యూహాల‌న్నీ దెబ్బేస్తున్నాయే!
X
ఏపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌లు అటు విప‌క్ష వైసీపీకే కాకుండా అధికార టీడీపీకి కూడా అత్యంత ప్రాముఖ్య‌మైన‌వ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. వైసీపీ వ్యూహాల‌కు విరుగుడు మంత్రంగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ర‌చిస్తున్న కొత్త కొత్త వ్యూహాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌క తప్ప‌దు. అయితే జ‌గ‌న్ వ్యూహాల‌కు విరుగుడుగా చంద్ర‌బాబు ర‌చిస్తున్న ఏ ఒక్క వ్యూహం కూడా వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌న్న వాద‌న ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది. లెక్క‌కు మిక్కిలి వ్యూహాల‌ను చంద్ర‌బాబు ర‌చిస్తుంటే... ఆ వ్యూహాల‌న్ని కూడా జ‌గ‌న్ వ్యూహాల ముందు నీరు గారిపోతున్నాయ‌ట‌. ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు ముగిసేలోగా చంద్ర‌బాబు నుంచి ఇంకెన్ని వ్యూహాలు వ‌స్తాయోన‌న్న కోణంలో స‌రికొత్త విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. జ‌గ‌న్.... జ‌నాక‌ర్ష‌క నేత‌ - జ‌న‌నేత‌. ఎవ‌రు ఔన‌న్నా - కాద‌న్నా... జ‌గ‌న్ స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాన్ని చూస్తే... ఈ మాట ముమ్మాటికీ నిజ‌మేన‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు. జ‌గ‌న్ స‌భ‌ల‌కు జ‌నం పోటెత్తుతుంటే.. చంద్ర‌బాబు స‌భ‌ల‌కు జ‌నం చాలా ప‌లుచ‌గానే హాజ‌ర‌వుతున్నారు. అది కూడా ఏదో బ‌లవంతం మీదనే స‌భ‌కు వ‌చ్చిన‌ట్లుగా బాబు స‌భ‌కు వ‌చ్చిన జ‌నం వ్యవ‌హ‌రిస్తున్న వైనం కూడా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది.

అయితే జ‌నాల్లో మార్పు వ‌చ్చే దాకా ఎన్నిక‌లు ఆగ‌వు క‌దా. ఓ వైపు జ‌గ‌న్ దూసుకెళుతుంటే... మ‌రోవైపు ఎన్నిక‌ల పోలింగ్ తేదీ కూడా ప‌రుగులు పెట్టుకుంటూ వ‌చ్చేస్తోంది. మ‌రేం చేయాలి? ఏదైనా జ‌నాక‌ర్ష‌క విధానాన్ని అమ‌లు చేయాలి? అదేంటీ? జ‌నాక‌ర్ష‌క నేత‌ల‌ను ప్రచారంలోకి ర‌ప్పించాలి. అలా త‌న మాట విని ఏ జ‌నాక‌ర్ష‌క నేత వ‌స్తారు? ఏపీలో అయితే ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. మరేం చేయాలి? ఉత్త‌రాదిన త‌న ఫ్రెండ్స్ చంద్ర‌బాబుకు క‌నిపించారు. గ‌తంలో యునైటెడ్ ఫ్రంట్ స‌మ‌యంలో ప‌లు పార్టీల‌తో చంద్ర‌బాబుకు ప‌రిచ‌యాలున్నాయి క‌దా. ఆ ప‌రిచ‌యాల‌ను ఇప్పుడు బాబు బ‌య‌ట‌కు తీశారు. అందులో భాగంగా బాబు మాట కాద‌న‌లేక‌పోయిన నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత‌ - జ‌మ్ముకాశ్మీర్ మాజీ సీఎం ఫ‌రూఖ్ అబ్దుల్లా మొన్న చంద్ర‌బాబు ప్ర‌చారంలో క‌నిపించారు. రానున్న రోజుల్లో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ - ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ - ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్ తదిత‌రులు కూడా బాబు ప్ర‌చారంలో క‌నిపించ‌నున్న‌ట్టుగా స‌మాచారం. అయినా ఏపీకి సంబంధించి స్థానిక ప‌రిస్థితుల‌తో పాటు సంప్ర‌దాయాలపై ఏమాత్రం అవ‌గాహ‌న లేని వీరంతా బాబుకు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌తారో చూడాలి.

మొన్న బాబు ప్ర‌చారంలో క‌నిపించిన ఫ‌రూఖ్ అబ్దుల్లా కూడా పెద్ద‌గా జ‌నాన్ని ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి. జ‌గ‌న్‌ పై ఓ సంచ‌ల‌న కామెంట్ చేయ‌డం మిన‌హా అబ్దుల్లా పెద్ద‌గా ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌నే చెప్పాలి. అయితే ఆ సంచ‌ల‌న కామెంట్ కూడా టీడీపీకే రివ‌ర్స్ అయిన ప‌రిస్థితి కూడా తెలిసిందే. బ‌య‌టి నుంచి వ‌చ్చిన తొలి నేత ద్వారానే బాబుకు బొప్పి క‌డితే... ఇక మిగిలిన వారితో ఆయ‌న‌కు ఏ మేర ప్ర‌యోజ‌నం ఉంటుందో చూడాలి. ఇదిలా ఉంటే... పార్టీ త‌ర‌ఫున స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న త‌న సుపుత్రుడు నారా లోకేశ్ ఎక్క‌డ త‌నను ముంచేస్తాడోన‌ని బాబు తెగ భ‌య‌ప‌డిపోతున్నార‌ట‌. బాబు భ‌యం ఇలా ఉంటే... తమ్ముళ్ల భ‌యం మరోలా ఉంద‌ట‌. లోకేశ్ ను త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంప‌కండి మ‌హాప్ర‌భో అంటూ త‌మ్ముళ్లంతా పార్టీ అధిష్ఠానానికి మొర‌పెట్టుకుంటున్నార‌ట‌. ఎక్క‌డ‌, ఎలా నోరు జార‌తారో తెలియ‌ని లోకేశ్... త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో నోరు జారితే... అది త‌మ మెడ‌కే చుట్టుకుంటుంద‌న్న భ‌యం ఇప్పుడు టీడీపీ అభ్య‌ర్థుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ట‌. మొత్తంగా బాబు ర‌చిస్తున్న ఏ ఒక్క వ్యూహం కూడా వ‌ర్క‌వుట‌వుతున్న ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ట‌.