Begin typing your search above and press return to search.

గుండెలు బాదేసుకున్న బాబు..ఇప్పుడేం వాదన వినిపిస్తారో?

By:  Tupaki Desk   |   22 Nov 2019 1:30 AM GMT
గుండెలు బాదేసుకున్న బాబు..ఇప్పుడేం వాదన వినిపిస్తారో?
X
ఒక ప్రభుత్వం కొలువు తీరి ఐదు నెలలు కూడా కాని వేళ.. విపక్షాలు ఏం చేస్తాయి? అందునా బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షం తీరు ఎలా ఉంటుంది? ప్రభుత్వం కుదుట పడి.. విధానపరమైన నిర్ణయాలు తీసుకొని.. తన పాలనను ప్రారంభించేందుకుఅవకాశం ఇవ్వటంతో పాటు.. ఏడాది పాటు మౌనంగా అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరును గుర్తించి..తర్వాత విమర్శలు.. నిరసనలు.. ఆందోళనలు చేపట్టటం సాధారణంగా జరిగేదే.

కానీ.. అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చి నెల రోజులు కాక ముందు నుంచే ఏపీ ప్రభుత్వం ఏదేదో చేస్తుందంటూ మీడియా ముందు ఉదరగొట్టటమే కాదు.. ప్రతి విషయాన్ని విమర్శించటమే ఎజెండాగా పెట్టుకున్న ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీరును పలువురు తప్పు పడుతున్నారు.

ఏపీ సీఎం జగన్ తీరు కారణంగా ఏపీలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకొచ్చిన పలు కంపెీలు వెనక్కి వెళ్లిపోతున్నాయంటూ ఆయన తరచూ గుండెలు బాదుకోవటం తెలిసిందే. ఇలాంటివేళ.. ఆయన వాదనకు భిన్నమైన పరిణామం తాజాగా చోటు చేసుకుంది. ఏపీలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ యూనిట్ ను స్టార్ట్ చేసేందుకు వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది.

అంతేకాదు.. తమ కంపెనీని కరవు జిల్లా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తామని.. ఇందుకు 120 ఎకరాల భూమిని కేటాయించాలని కోరటం.. అందుకు ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఈ కంపెనీ ఏపీలో రూ.వెయ్యి కోట్ల మేర పెట్టబడులు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ కంపెనీ కారణంగా ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ 3వేల మందికి ఉపాధి లభిస్తుందన్న వాదన వినిపిస్తోంది.

భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన వీర వాహన్ ఉద్యోగ్ సంస్థకు సాధారణ ప్రోత్సహాకాలతో పాటు.. విద్యుత్.. నీటి సరఫరాలోనూ సబ్సిడీలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గతంలో ఇదే కంపెనీకి 50 ఎకరాల భూమిని బాబు సర్కారు కేటాయించగా.. ఆ భూమి సరిపోదని కంపెనీ చెప్పింది.తాజాగా ఆ కంపెనీ ప్రతిపాదనల్ని నిశితంగా పరిశీలించిన జగన్ ప్రభుత్వం 120 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఓకే చెప్పేసింది. మరి.. కంపెనీలు పోతున్నాయని.. పెట్టుబడులు రావట్లేదన్న బాబు వాదనకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ పరిణామంపై విపక్ష నేత ఎలా రియాక్ట్ అవుతారో?