Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఇంటిని చూసి ఎందుకంత అసూయ బాబు?

By:  Tupaki Desk   |   27 Feb 2019 9:00 AM GMT
జ‌గ‌న్ ఇంటిని చూసి ఎందుకంత అసూయ బాబు?
X
పేదోడు.. ఏ మాత్రం స్థితిలేనోడికి డ‌బుల్ బెడ్రూం ఇల్లు. అది ఏపీ అయినా తెలంగాణ అయినా. పేదోడి విష‌యంలో ప్ర‌భుత్వాలు ఇంత విశాలంగా ఆలోచించిన‌ప్పుడు.. ఒక పార్టీ రాష్ట్ర కార్యాల‌యం.. ఒక పార్టీ అధినేత త‌మ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు ఇల్లు క‌ట్టుకుంటే.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఏడుస్తారా?  అయినా.. ఈ దేశంలో ఉద్య‌మ నేత‌లు మొద‌లు రాజ‌కీయ నాయ‌కుల ఇళ్లు క‌ట్టుకోవ‌టం కొత్తేం కాదు.

ఎక్క‌డి దాకానో ఎందుకు?  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంగ‌తే తీసుకుంటే.. ఆయ‌న ఏపీకి ముఖ్య‌మంత్రే కానీ ఆయ‌న‌కు ఏపీ రాజ‌ధానిలో సొంతిల్లు లేని దుస్థితి. కానీ.. అదే స‌మ‌యంలో ప‌క్క రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో త‌న పాత ఇంటిని కూల్చేసి.. పెరిగిన అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు భారీ ఎత్తున నిర్మాణం చేయించారు.

చివ‌ర‌కు ఆ ఇంట్లోకి పార్టీ ఎంపీల‌ను కూడా పిల‌వ‌కుండా.. ఆ ఇంటి వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. బాబును ఎప్పుడూ బ్యాక్ చేసే మీడియా సంస్థ‌లు సైతం బాబు గారి బ‌డా ఇంటికి సంబంధించిన ఫోటోల్ని అచ్చేసేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు. భారీ ఎత్తున ఇల్లు నిర్మించుకున్న బాబు.. తాజాగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తిలో కొత్తింటిని నిర్మించుకున్న వైనాన్ని త‌ప్పు ప‌ట్టిన తీరు చూస్తే.. బాబు మ‌రీ ఇంత‌టి ఇరుకు మ‌న‌స్త‌త్వం ఉన్న నేతా? అన్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.

జ‌గ‌న్ కొత్తింటి గృహ‌ప్ర‌వేశం చేస్తున్న వేళ‌.. చంద్ర‌బాబు ఆ విష‌యం మీద మాట్లాడ‌టం.. ఆయ‌న స్థాయికి ఏ మాత్రం త‌గ‌ద‌ని చెప్పక త‌ప్ప‌దు. హైద‌రాబాద్ వ‌దిలి జ‌గ‌న్ రాలేదంటూ ఇంత‌కాలం ఏడుపు ఏడ్చిన బాబు.. ఇప్పుడు ప్యాలెస్ లాంటి ఇల్లు క‌ట్టుకొని వ‌స్తారా? అంటూ విమ‌ర్శించారు.  వోకే.. జ‌గ‌న్ పెద్ద ఇల్లు క‌ట్టుకున్నారు. కానీ.. బాబు అది కూడా చేయ‌లేదు. ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉండి తెలంగాణ‌లో పాత ఇంటిని కూల‌గొట్టి కొత్త ఇంటిని భారీ స్థాయిలో క‌ట్టుకున్నారు. తన‌కు త‌ప్ప మ‌రెవ‌రికీ ఇళ్లు ఉండ‌కూద‌ని బాబు భావిస్తారా?

ల‌గ్జ‌రీ అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్న బాబు.. నిండా నాలుగు రోజుల కూడా గ‌డ‌ప‌ని హైద‌రాబాద్‌లోని సెక్ర‌టేరియ‌ట్ లో సీఎం ఛాంబ‌ర్ కోసం దాదాపు రూ.15 కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని త‌గ‌ల‌బెట్టిన వైనాన్ని మ‌ర్చిపోగ‌ల‌మా?  వాస్తు కోస‌మ‌ని.. ఇంటీరియ‌ర్ మ‌స్తుగా ఉండాలంటూ మార్పులు చేసి.. కేసీఆర్ కార‌ణంగా హైద‌రాబాద్ వ‌దిలి వ‌చ్చేసిన ఆయ‌న‌.. తాను వృధాగా ఖ‌ర్చు చేసిన మొత్తం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?  గురివిందకు పెద్ద గురువుగా వ్య‌వ‌హ‌రించే బాబు.. ఇప్ప‌టికైనా కింద‌నున్న న‌లుపు చూసుకుంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వేలెత్తి చూపించే ముందు.. ఆ వేలును త‌న దిక్కుకు చూసుకొని ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకుంటే బాగుంటుందేమో బాబుగారు?