Begin typing your search above and press return to search.

ఫ్ర‌స్ట్రేష‌న్‌!... బాబుకా? జ‌గ‌న్‌ కా?

By:  Tupaki Desk   |   19 Feb 2019 5:13 PM GMT
ఫ్ర‌స్ట్రేష‌న్‌!... బాబుకా? జ‌గ‌న్‌ కా?
X
ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ జోష్ క‌నిపించాల్సిన అధికార టీడీపీలో నైరాశ్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌గా - తీవ్ర ఆందోళ‌న‌లో క‌నిపించాల్సిన విప‌క్షం వైసీపీలో మాత్రం జోష్ కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీలు - ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. అంతేకాకుండా టీడీపీలో చాలా కాలం నుండి కొన‌సాగుతూ వ‌స్తున్న విజ‌య్ ఎలక్ట్రిక‌ల్స్ అధినేత దాస‌రి జై ర‌మేశ్ లాంటి కీల‌క నేత‌లు కూడా పార్టీని వీడిపోయారు. ఇక రాజ‌కీయాల్లో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు స‌మ‌కాలీనుడిగా భావిస్తున్న ఆయ‌న తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా వైసీపీలో చేరిపోయారు. మొత్తంగా ప‌రిస్థితి చూస్తుంటే... ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో విప‌క్ష వైసీపీదే గెలుపు అని చాలా స్ప‌ష్టంగానే తెలిసిపోతోంది. ఈ క్ర‌మంలో నిన్న‌టిదాకా వ‌ల‌స‌ల‌పై త‌న‌దైన మార్కు దూష‌ణ‌ల‌తో విరుచుకుప‌డిన చంద్రబాబు... తాజాగా నేడు మాత్రం మాట మార్చేశారు.

త‌న పార్టీ నుంచి ఇప్ప‌టికే ఎంత‌మంది బ‌య‌ట‌కెళ్లారు - ఇంకెంత మంది బ‌య‌ట‌కు వెళ్ల‌బోతున్నారు అన్న విష‌యాలపై కాస్తంత క్లారిటీ తీసుకున్న చంద్ర‌బాబు... ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రోజుకొక‌రు చొప్పున వైసీపీలో చేరిపోతున్న క్ర‌మంలో నిజంగానే చంద్రబాబు డిఫెన్స్‌ లో ప‌డిపోయార‌ని చెప్ప‌క తప్ప‌దు. నిన్న‌టిదాకా రాష్ట్రంలో త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ అధినేత వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి ఫ్ర‌స్ట్రేష‌న్‌ కు గుర‌వుతున్నార‌ని అదాటు వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు... వ‌రుస‌గా త‌గులుతున్న షాకుల‌తో తానే ఫ్ర‌ష్ట్రేష‌న్‌ కు గుర‌వుతున్నాన‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. అయితే రాజ‌కీయాల్లో ఎంతైనా సీనియ‌ర్ మోస్ట్ నేత క‌దా.. జ‌గ‌న్ ఫ్ర‌స్ట్రేష‌న్‌ కు గుర‌వుతున్నార‌ని చెబుతుంటే జ‌నాలు న‌మ్మ‌ట్లేద‌ని అనుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ... ఆ మాట‌ను వ‌దిలేసి ఇప్పుడు వాస్త‌వాల‌ను మాట్లాడేందుకు సిద్ధ‌మైపోయారు. నిత్యం జ‌గ‌న్‌కుయ ఫ్ర‌స్ట్రేష‌న్‌ కు గుర‌వుతున్నార‌ని చెబితే... త‌న‌లోని ఫ్ర‌స్ట్రేష‌న్ ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న భావ‌న‌తోనే బాబు ఈ త‌ర‌హా మార్పు చేసుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో.

మొత్తంగా త‌న ఫ్ర‌స్ట్రేష‌న్ ను కంట్రోల్ చేసుకున్న చంద్ర‌బాబు.. నేటి ఉద‌యం పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన టెలికాన్ఫ‌రెన్స్ సంద‌ర్బంగా వాస్త‌వాల‌ను ఒప్పుకునే య‌త్నం చేశార‌ట‌. ఇప్ప‌టికే పార్టీని వీడిన నేత‌ల గురించి ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు... పార్టీకి మ‌రింత మేర న‌ష్టం జ‌ర‌గ‌నుంద‌న్న విష‌యాన్ని కూడా ఒప్పేసుకున్నార‌ట‌. ఇప్ప‌టిదాకా టీడీపీని వీడి వైసీపీలో చేరిన నేత‌ల మాదిరే మ‌రింత మంది నేత‌లు కూడా వైసీపీలో చేర‌బోతున్నార‌న్న మాట‌ను చంద్ర‌బాబు చెప్పార‌ట‌. మ‌రి క‌ళ్లెదుటే ప‌రిస్థితి క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గా క‌నిపిస్తుంటే... ఎన్నాళ్ల‌ని వాస్త‌వాల‌ను మాట్లాడ‌కుండా ఉంటారు చెప్పండి. అదే కోవ‌లో ఇప్పుడు చంద్రబాబు కూడా వాస్త‌వాల‌ను ప్ర‌స్తావించక త‌ప్పడం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.