Begin typing your search above and press return to search.

కేసీఆర్ మీటింగులపై చంద్రబాబు గూఢచర్యం!

By:  Tupaki Desk   |   14 May 2019 2:17 PM GMT
కేసీఆర్ మీటింగులపై చంద్రబాబు గూఢచర్యం!
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థులపై కోవర్టు ఆపరేషన్లను నిర్వహించడంలో ఘనుడు అనే ప్రచారం ఒకటి ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పై చంద్రబాబు నాయుడు అలాంటి ఆపరేషన్ ను నిర్వహించాడని అంటారు. వైఎస్ ముందు చంద్రబాబు అలాంటి ఎత్తులు వేయలేకపోయినా.. ప్రజారాజ్యం పార్టీని నాటి ఎన్నికల ముందే చిత్తు చేయడంలో చంద్రబాబు నాయుడు తన ప్రణాళికను కేశినేని నానితో అమల్లో పెట్టారనేది ఒక ప్రచారం!

ఆ సంగతలా ఉంటే..ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పై చంద్రబాబు నాయుడి మార్కు గూఢచర్యం కొనసాగుతూ ఉందనే టాక్ వినిపిస్తూ ఉంది. కేసీఆర్ ఎక్కడకు వెళ్లినా అక్కడ చంద్రబాబు నాయుడు ఏజెంట్లు ఉంటున్నారని - అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వారిని చంద్రబాబు నాయుడు తన వద్దకు పిలిపించుకొంటూ ఉన్నారనే ప్రచారం ఇప్పుడు తీవ్రస్థాయికి వెళ్లింది.

ఇది వరకూ కేసీఆర్ ఒడిశా వెళ్లి అక్కడ బిజూ జనతాదళ్ పార్టీ అధినేతతో సమావేశం అయినప్పుడు అక్కడి సమాచారాన్ని ఒక బీజేడీ ఎంపీ చంద్రబాబుకు చేరవేశారు. నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ సమావేశం ముగిసిన వెంటనే బీజేడీ ఎంపీ ఒకరు వచ్చి చంద్రబాబుతో సమావేశం అయ్యారు!

సేమ్ కథ తమిళనాడు విషయంలోనూ రిపీట్ అయ్యింది. నిన్న స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం జరగగా.. వెంటనే అన్నాడీఎంకే ఎమ్మెల్యే దొరై మురుగన్ వచ్చి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఇదీ వరస. ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ సమావేశం కావడం, వెంటనే సదరు పార్టీ వాళ్లు ఒకరు వచ్చి చంద్రబాబుతో సమావేశం కావడం జరుగుతూ ఉంది. ఇక మమతా బెనర్జీ, దేవేగౌడ వంటి వాళ్లతో కూడా కేసీఆర్ సమావేశం అయ్యారు.

అయితే సదరు నేతలే చంద్రబాబుకు టచ్లో ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా స్పై అవసరం లేదు! చంద్రబాబు నాయుడు కేసీఆర్ పై గట్టిగానే గూఢచార్యాన్ని నెరుపుతూ ఉన్నారని మాత్రం స్పష్టం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు.