Begin typing your search above and press return to search.
ఉప ముఖ్యమంత్రికి ఉత్త చేయేనా చంద్రబాబూ..
By: Tupaki Desk | 8 Feb 2019 5:04 PM GMTకర్నూలు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. డోన్ సీటు తమకు కావాలని కోట్ల కోరుతుండడంతో ఇంతకాలం దానిపై ప్రతిష్ఠంభన ఏర్పడినా చంద్రబాబు ఇప్పుడు దానికి తలూపారని టాక్. అయితే... డోన్ సీటు కోట్ల ఫ్యామిలీకి ఇస్తే అప్పుడు కేఈ పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న. కోట్ల అడుగుతున్న డోన్ స్థానం కోసం కేఈ ఫ్యామిలీ అంతకుముందే కర్చీఫ్ వేసి ఉంచారు. కేఈ కృష్ణమూర్తి గత ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ ఈసారి తనకు కానీ - తన కుమారుడికి కానీ డోన్ నియోజకవర్గ టికెట్ కావాలని కోరుతున్నారట. ఇప్పుడు తన బద్ధ విరోధి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి చంద్రబాబు ఆ సీటు ఇస్తే కేఈ పరిస్థితి ఏమిటనేది ప్రశ్న.
కోట్ల - కెఇ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా శత్రుత్వం ఉంది. ఇద్దరి మధ్య తారస్ధాయిలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. రెండు వర్గాల్లోను అనుచరులు ఎందరో నష్టపోయారు. దీంతో ఈ రెండు కుటుంబాలు రాజకీయం గానూ బద్ధ శత్రువులు. ఈ రెండు కుటుంబాలూ ఎప్పుడూ వేర్వేరు పార్టీలో ఉంటాయి. ఇప్పుడు కోట్ల టీడీపీలో చేరితే రెండు ఫ్యామిలీస్ ఒకే పార్టీలో ఉన్నట్లువుతుంది.
రాయలసీమలో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది కడప జిల్లాలో ఇప్పటికే చంద్రబాబుకు అనుభవంలోకి వచ్చినప్పటికీ కర్నూలు లోనూ ఇప్పుడు ఆయన అదే ప్రయోగం చేస్తున్నారు. కడపలో ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఎంత సర్దిచెప్పినా కూడా రామసుబ్బరెడ్డి - ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఇప్పటికే వైరం సమసిపోలేదు. పైగా పార్టీని నమ్ముకుని ఉన్న రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యం తగ్గించి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు మంత్రిని చేశారు.
ఇప్పుడు కోట్ల రాకతో కేఈ వర్గం కూడా అదే అనుమానంలో ఉందట. ఉపముఖ్యమంత్రి - రెవెన్యూ మంత్రి హోదా ఉన్నప్పటికీ ఇప్పటికే ఏమాత్రం ప్రాధాన్యం లేకుండాపోయింది కేఈకి. ఇప్పుడు కోట్లను కనుక పార్టీలోకి తీసుకొస్తే చంద్రబాబు తనను పూర్తిగా పక్కనపెట్టడం ఖాయమని కేఈ వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం.