Begin typing your search above and press return to search.
కోడెలపై తమ్ముళ్ల కంప్లైంట్స్..బాబు లైట్ తీసుకున్నట్టే!
By: Tupaki Desk | 7 Aug 2019 3:23 PM GMTకే ట్యాక్స్ పేరిట గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలను పీల్చి పిప్పి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు సంబంధించిన పంచాయతీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గడప తొక్కేసింది. ఇప్పటికే కోడెల వ్యవహారంపై సత్తెనపల్లి తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తాజా ఎన్నికల్లో కోడెలతో పాటు టీడీపీకి ఘోర పరాభవం - జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడంతో కే ట్యాక్స్ బాధితులు ఒక్కరొక్కరుగానే బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కోడెల కుమారుడు - కుమార్తె లపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కోడెల కుమార్తె ఏకంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇలాంటి తరుణంలో కోడెల వేధింపులు తమకూ ఎదురయ్యాయంటూ టీడీపీలో ఓ వర్గం ఆగ్రహం మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ వర్గం నానాటికీ బలోపేతం అవుతుండగా - కోడెల వర్గం మాత్రం ఆత్మరక్షణలో పడిపోయింది.
ఈ నేపథ్యంలో ఇన్నేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెలను తామిక భరించలేమని - ఆయనను సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పించాలని కోడెల వ్యతిరేక వర్గం చంద్రబాబు వద్ద డిమాండ్ చేసింది. అదే సమయంలో తనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్న విషయాన్ని గమనించిన కోడెల కూడా చంద్రబాబు వద్దకు పరుగులు పెట్టారు. వెరసి బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుతో ఇటు కోడెలతో పాటు కోడెల వ్యతిరేక వర్గం కూడా భేటీ అయ్యాయి. విడివిడిగానే జరిగిన ఈ భేటీల్లో ఎవరి వాదనలు వారు వినిపించారట. ఇరు వర్గాల వాదనలను ఓపిగ్గానే విన్న చంద్రబాబు... కోడెల వర్గానికే కాస్తంత అనుకూలంగా వ్యవహరించారని - సత్తెనపల్లి నుంచి కోడెలను తప్పించే ఆలోచన ఇప్పటికి అయితే లేదన్నట్లుగా చంద్రబాబు సంకేతాలిచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
స్పీకర్ గా ఉన్న కోడెల తన కే ట్యాక్స్ వసూళ్ల విషయంలో టీడీపీ నేతలు - కార్యకర్తలను కూడా మినహాయించలేదని, ఈ కారణంగా ఆయనను సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పించాల్సిందేనని కూడా కోడెల వ్యతిరేక వర్గం డిమాండ్ చేసిందట. ఈ డిమాండ్ ను కాస్తంత గట్టిగానే వినిపించే క్రమంలో బాబుతో కొందరు భేటీ అయిన సందర్భంలోనే పార్టీ కార్యాలయం ముందు మరికొందరు చేరి కోడెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారట. అంతకుముందే చంద్రబాబుతో భేటీ అయిన కోడెల తన వాదనను వినిపించి బయటకు వెళ్లిపోయారట. ఈ క్రమంలో కోడెల వ్యతిరేక వర్గం చేస్తున్న వాదనను సావదానంగానే విన్న చంద్రబాబు.. సత్తెనపల్లి పార్టీకి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, దానిని తానే స్వయంగా చూసుకుంటానని వారికి హామీ ఇచ్చారట. ఈ హామీ ద్వారా కోడెలను తప్పించాలన్న వారి వాదనను తిరస్కరిస్తూనే... స్వయంగా తానే చూసుకుంటానన్న మాటతో వారి నోళ్లకు తాళమేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా ఎంతమేర ఆరోపణలు వచ్చినా... కోడెలపై చర్యలకు బాబు అంత సుముఖంగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి.