Begin typing your search above and press return to search.
బాబు చెప్పినట్లు పవన్ కు కేటీఆర్ కాల్ చేశారా?
By: Tupaki Desk | 24 Oct 2018 11:02 AM GMTఏపీ రాజకీయాల్లోనూ.. సోషల్ మీడియాలోనూ ఒక అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాజమహేంద్రవరంలో జనసేన అధ్వర్యంలో కవాతు జరగటం తెలిసిందే. ఈ వేదిక మీద నుంచి సీఎం చంద్రబాబును.. ఆయన కుమారుడు కమ్ మంత్రి లోకేశ్ ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. సర్పంచ్ గా గెలవని లోకేశ్ కు ఏకంగా పంచాయితీ రాజ్ మంత్రి పదవిని ఎలా కట్టబెడతారంటూ నిప్పులు చెరిగారు.
ఈ సభ అనంతరం తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ నుంచి పవన్ కు ఫోన్ వచ్చిందని.. కవాతు సభ సక్సెస్ కావటంపై ఆయన్ను అభినందించినట్లుగా వార్తలు వచ్చాయి. ఏపీలో జరిగిన ఒక సభ సక్సెస్ అయ్యిందని పవన్ కు కేటీఆర్ ఫోన్ చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. ఈ సమాచారం మొత్తం అధికారిక సమాచారం కానే కాదు. ఎవరూ దీన్ని కన్ఫర్మ్ చేసింది కూడా లేదు.
ఇదిలా ఉంటే.. పార్టీ నేతల సమీక్షా సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ కు తెలంగాణ తాజా మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారని.. కవాతు సభ బాగా జరిగినందుకు అభినందనలు తెలియజేశారన్న మాట రావటం మరింత ఆసక్తికరంగా మారింది. పది మంది అనుకునే వంద మాటల్ని సీఎంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నోటి నుంచి రావటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇదే విషయాన్ని పవన్ కు సన్నిహితంగా ఉంటున్న నాదెండ్ల మనోహర్ ను ప్రశ్నించగా.. ఆ విషయం మీద తనకు క్లారిటీ లేదని చెప్పారు. నిజంగానే పవన్ కు కేటీఆర్ కానీ ఫోన్ చేస్తే.. ఆ విషయాన్ని ఏదో రూపంలో బయటకుతెలియజేయటం ఖాయం. ఒకవేళ చేయకున్నా.. ఇలాంటి వాదనలు బయటకు వచ్చినప్పుడు వాటిని ఖండిస్తుంటారు. కానీ.. ఇప్పుడు అది కూడా ఏమీ చోటు చేసుకోలేదు. దీంతో.. పవన్ కు కేటీఆర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందా? అన్నది సందేహంగా మారింది.
ఇదే ఉదంతం మీద కేటీఆర్.. పవన్ వర్గాలు రియాక్ట్ అవుతూ.. స్పందించనంత మాత్రాన ఫోన్ వచ్చినట్లు కాదన్న మాటను స్పష్టం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబుమైండ్ గేమ్ అని.. కేటీఆర్.. పవన్ ను ఒక జట్టుగా చేస్తే.. పవన్ పై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేలా చేసేందుకే ఇలాంటివి ప్రచారంలోకి తెస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు.. సామాన్యులు మాట్లాడుకునేలా మాట్లాడటం సరికాదన్న మాట వినిపిస్తోంది. పవన్ ను టార్గెట్ చేయటానికి కేటీఆర్ భుజాల మీద తుపాకుల్ని పెడుతున్నరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.