Begin typing your search above and press return to search.
బాబు లాస్ట్ కేబినెట్ భేటీ!..అంతా ఆంక్షల మధ్యేనట!
By: Tupaki Desk | 13 May 2019 4:50 PM GMTటీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిపై అటు పొలిటికల్ సర్కిల్స్ నుంచే కాకుండా ఇటు మీడియా - జనరల్ పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సహా మొత్త దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సార్వత్రిక ఎన్నికలు... అది కూడా సుదీర్ఘ షెడ్యూల్ తో కూడిన ఈ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఏకంగా రెండు నెలలకు పైగానే అమల్లోకి వచ్చేసింది. ఈ నెల 25 తర్వాత గానీ ఎన్నికల కోడ్ ముగియదు. అయితే కేంద్రం తనను టార్గెట్ చేసి తనకు రాజ్యాంగం నుంచి దక్కిన హక్కులను కాలరాస్తోందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు... తనను తాను డిఫెండ్ చేసుకునే క్రమంలో ఓ వైపు కేంద్రంతో పోరు అంటూనే మరోవైపు ఈసీతో పోరాటం మొదలెట్టేశారు.
ప్రజలు తనకు ఐదేళ్ల పాటు అధికారం చెలాయించమని తీర్పు చెప్పారని - అలాంటిది ఎన్నికల కోడ్ పేరిట తన హక్కులను ఎలా లాగేస్తారని కూడా చంద్రబాబు వితండ వాదన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ భేటీని నిర్వహించి తీరతానని ఆయన కేంద్రానికి - ఎన్నికల సంఘానికి దాదాపుగా సవాల్ విసిరారనే చెప్పాలి. అయితే తాను ముందుగా ప్రకటించిన 10వ తేదీ దాటిపోయినా చంద్రబాబు కేబినెట్ భేటీకి సాహసించలేదు. ఎందుకంటే... ఈసీ అనుమతి లేకుండా కేబినెట్ భేటీ నిర్వహిస్తే... తాను ఇరుక్కుపోయినట్టేనన్న విషయం ఆయనకు అర్థమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కాస్తంత వెనక్కు తగ్గిన చంద్రబాబు... ఈసీ అనుమతి తీసుకోవాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి లేఖ రాశారు. ఓ సీఎంగా రాసిన లేఖను సీఎస్ పక్కనపెట్టలేరు కదా... అందుకే ఎల్వీ కూడా బాబు లేఖను ఈసీకి పంపారు. సోమవారం ఉదయం బాబుతోనూ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీకి ఈసీ ఎట్టకేలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే కేబినెట్ భేటీకి అనుమతించామని చెప్పి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని చంద్రబాబుకు ఈసీ గట్టి వార్నింగే ఇచ్చేసింది. ఐదేళ్ల పాలనలో చంద్రబాబుకు ఇది చివరి కేబినెట్ భేటీ కిందే లెక్క. చివరి కేబినెట్ భేటీ అయినా కూడా చంద్రబాబు... దాదాపుగా ఆంక్షల మధ్యే ఈ భేటీని నిర్వహించక తప్పని పరిస్థితి. అనవసరంగా కేబినెట్ భేటీ అంటూ రచ్చ చేసిన చంద్రబాబు... ఇలా ఈసీ నుంచి అనుమతి తీసుకుని కూడా స్వేచ్ఛగా వ్యవహరించలేని స్థితిని కొని తెచ్చుకున్నారన్న వాదన ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. మొత్తంగా ఆంక్షల మధ్యన - ఈసీ కనుసన్నల్లో కేబినెట్ భేటీకి సిద్ధమైపోయిన చంద్రబాబు పరిస్థితి శత్రువుకు కూడా రావొద్దంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర కామెంట్లు వినిపిస్తున్నాయి.