Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు స్థానిక ఎన్నికలంటేనే పడదా!
By: Tupaki Desk | 17 March 2020 3:30 AM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తను 14 సంవత్సరాల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా తరచూ చెప్పుకుంటూ ఉంటారు. అనేక విషయాల్లో ఆయన తన అనుభవం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. మీడియా కనిపిస్తే చాలు 14 యేళ్ల సీఎం - 9 యేళ్ల ప్రతిపక్ష అనుభవం అంటూ.. చంద్రబాబు నాయుడు నంబర్లు చెబుతూ ఉంటారు. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తన చేతిలో అన్నేళ్లు అధికారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ స్థానిక ఎన్నికలను నిర్వహించడానికి అంత ఉత్సాహం చూపకపోవడం.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 14 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే స్థానిక ఎన్నికలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని పరిశీలకులు అంటున్నారు. మామూలు లెక్క ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సంవత్సరాల నంబర్ ను బట్టి కనీసం మూడు సార్లు స్థానిక ఎన్నికలు జరగాల్సింది. అయితే ఆయన మూడు టర్మ్స్ లోనూ కలిపి ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే ఆ ఎన్నికలు జరిగాయి.
ఇక 2018లోనే స్థానిక ఎన్నికలు జరగాల్సింది. అప్పుడు చంద్రబాబు నాయుడే సీఎం. అయితే వాటి నిర్వహణకు ఆయన ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చివరి సారి స్థానిక ఎన్నికలు జరిగాయి. ఐదేళ్లకు ఆ పదవీ కాలం పూర్తి అయ్యింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఆ ఎన్నికలు జరగాల్సింది. కానీ.. నిర్వహిచంలేదు. నిధులు కట్ అవుతాయనే విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికలను నిర్వహిచంలేదని పరిశీలకులు అంటున్నారు.
దానికి ఒక కారణం ఉందట.. స్థానిక సభ్యుల ఎన్నిక వల్ల ఎమ్మెల్యేల- అధికార పార్టీ నేతల పవర్స్ కొన్ని కట్ అవుతాయి. ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ లు రంగంలోకి దిగితే.. సాధారణ కార్యకర్తలకు అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలను కూడా నిర్వహించలేదని.. వారికి బదులుగా.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే డైరెక్టుగా జన్మభూమి కమిటీలంటూ బరిలోకి దించి.. వారికే అన్ని అధికారాలనూ అప్పగించారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అందుకే పవర్ లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల ప్రసక్తిని తీసుకువచ్చే వారు కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.