Begin typing your search above and press return to search.
బాబుకు చివరికి మిగిలింది ఇదే!
By: Tupaki Desk | 1 Nov 2018 2:24 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో హాట్ టాపిక్. జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో భాజపా వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం బిగించిన చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో డీల్లీలో భేటీ అయ్యారు. అంతకుముందు రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు తెలంగాణలో మహాకూటమి సీట్ల పంపకంతో పాటు..ఇతర పనులలో బిజీబిజీగా గడిపారు. బీజేపీయేతర పార్టీలతో జతకట్టి రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ - నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాలతో భేటీ అయ్యారు.
అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సభ్యత్వాన్ని చంద్రబాబు పునరుద్ధరించుకొని పార్టీ నేతలతో ప్రసంగిస్తూ...ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలుస్తానన్నారు. అందరం కలిసి ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని రాహుల్ తో చెబుతానన్నారు. బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామాన్ని కాపాడుకోవడానికే తన ప్రయత్నమని చంద్రబాబు వివరించారు. అందరితో కలిసి జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. మోడీ - అమిత్ షాలకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
అయితే, గతంలో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా వెళ్లిన బాబు తాజాగా అదే జాతీయ పార్టీతో కలిసి ఎలా ఉద్యమిస్తారనేది మొదటి సందేహం. జాతీయ రాజకీయాల్లో తానే సీనియర్ అని చెప్పుకొనే బాబు ప్రాంతీయ పార్టీలను ఏకం చేయకుండా...జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో దోస్తీకి తహతహలాడటం ఆసక్తికరంగామారింది. రాహుల్ సైతం ఆయనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే...రాజకీయాల్లో అవసరాలే అత్యంత ప్రాధాన్యమైన అంశమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.