Begin typing your search above and press return to search.

ప్రజల్లో అసంతృప్తి ఉందని అంగీకరించిన బాబు

By:  Tupaki Desk   |   18 July 2017 3:43 PM GMT
ప్రజల్లో అసంతృప్తి ఉందని అంగీకరించిన బాబు
X
నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీ పూర్తిగా ఆశలు వదులుకున్నట్లు అర్థమవుతోంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు చేసిన వ్యాఖ్యలతో ఆ విషయం దాదాపుగా అర్థమైపోయింది. ఏమాత్రం అవకాశం ఉన్నా గెలుపు మాదే అని గట్టిగా చెప్పే చంద్రబాబు అందుకు విరుద్ధంగా ఇప్పుడు తమపై నంద్యాల ప్రజలకు అసంతృప్తి ఉందని అంగీకరించడం పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది.

నంద్యాల ప్రజల్లో తమపై అసంతృప్తి ఉందని.. ఉప ఎన్నికల్లో పార్టీకి కలిసివచ్చే ఏ చిన్న అవకాశన్నీ వదులుకోవద్దని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు చంద్రబాబు. అయితే.. చంద్రబాబు ఇలా ప్రజా వ్యతిరేకతను అంగీకరించడం వెనుక రివర్స్ వ్యూహం - మైండ్ గేమ్ ఉందని తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో ఎలాగూ ఓటేయరని గుర్తించడంతో ఆ సత్యాన్ని అంగీకరిస్తూ వారి వద్ద మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఐదుగురు మంత్రులు - 12మంది ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. మరికొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా నంద్యాలలో ప్రచారం చేసే విధంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఎలాగైనా గెలుపొందాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే స్వయంగా చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకతను అంగీకరించాల్సి వచ్చింది.