Begin typing your search above and press return to search.
లోకేష్ కోసం ఆయనను కన్సల్ట్ అయిన చంద్రబాబు నాయుడు?
By: Tupaki Desk | 24 Feb 2020 5:30 PM GMTనారా లోకేష్ ను నాయకుడిగా నిలబెట్టడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎంత పెద్ద సవాల్ గా మారిందో అందరికీ తెలిసిన సంగతే. తన తనయుడిని మేధావిగా చెబుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు. నగదు బదిలీ పథకం లోకేష్ సలహానే అంటూ దశాబ్దం కిందటే చంద్రబాబు నాయుడు తనయుడిని హైలెట్ చేయ ప్రయత్నించారు. ఆ నగదు బదిలీ పథకమూ ప్రజలకు నచ్చలేదు - లోకేష్ కూడా ఇంకా ఆకట్టుకోలేకపోతూ ఉన్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు లోకేష్ ను మంత్రిని చేసి - ఎమ్మెల్సీగా చేశారు. అది అయాచితంగా లభించిన పదవి. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. తండ్రి చేతిలో అధికారంలో ఉంది కాబట్టి లోకేష్ మంత్రి అయ్యారనే అభిప్రాయాలు సహజంగానే వినిపించాయి. అంతకన్నా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం మరిన్ని విమర్శలకు దారి తీసింది!
తండ్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసి - అది కూడా తాము రాజధానిగా ప్రకటించిన ప్రాంతంలో పోటీ చేసి.. ఎమ్మెల్యేగా నెగ్గలేకపోవడం అంటే అది చాలా పెద్ద అవమానమే! ఎన్టీఆర్ మనవడిని - చంద్రబాబు కొడుకుని అని చెప్పుకునే లోకేష్ బాబు.. ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. ఇప్పుడు నారా లోకేష్ రాజకీయంపై ఏపీ జనాల్లో ఎలాంటి అంచనాలూ లేవు!
ఇక ఏదైనా హైప్ క్రియేట్ చేయడానికి కూడా లోకేష్ కు అంబ పలకడం లేదాయె! ఇప్పటికూ సూటిగా - సూక్ష్మంగా - క్లుప్తంగా మాట్లాడటం రాదు అని అనిపించుకున్నారాయన. ప్రత్యర్థులు లోకేష్ కు ఒక నిక్ నేమ్ పెట్టేసి ఆటాడుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ లోకేష్ మాటల్లో స్పష్టత లేదు. ఆ పై ఆయన గత ప్రసంగాలు ఇప్పటికీ నెట్ లో వైరల్ అవుతూనే ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి కుల పిచ్చి - మత పిచ్చి - బంధుప్రీతి ఉన్నాయని ఒకసారి - తెలుగుదేశానికి ఓటేస్తే మనకు మనం ఉరేసుకున్నట్టే అని లోకేష్ మరోసారి వ్యాఖ్యానించి.. ప్రత్యర్థులకు ఆయుధాలను అందించారు.
ఇక లోకేష్ ను మాటల పరంగా మెరుగుపరచడం కోసం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు ప్రయత్నాలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అవేమో కానీ.. ఇప్పుడు మళ్లీ మరో మేధావిని కన్సల్ట్ అయ్యారట. ఈ సారి మరెవరినో కాదు..యండమూరి వీరేంద్రనాథ్ ను సంప్రదించారట! యండమూరిని తెలుగు వారికి వేరే పరిచయం చేయనక్కర్లేదు. నవలా రచయితగా - సినీ రచయితగా పేరు కలిగిన వారే. నవలలు తెలుగునాట సేల్స్ ఆగిపోయిన తర్వాత యండమూరి వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా మారారు. ఆ తరహా పుస్తకాలు రాసి - ఆ తరహా స్పీచ్ లు ఇచ్చి దాన్నో మార్కెటింగ్ గా మార్చుకున్నారు. ఇలాంటి నేఫథ్యంలో లోకేష్ ను మెరుగులు దిద్దే బాధ్యతలను ఆయనకు అప్పగించారట చంద్రబాబు. ఈ విషయంలో యనమల సలహా కూడా ఉందట!
ఇప్పటికైతే లోకేష్ ప్రసంగించడంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా సత్తా చాటలేదు. ఇక ట్వీట్ లైతే ఆయన పేరు మీద పోస్ట్ అవుతున్నాయి కానీ - లోకేష్ మాటలకూ ఆ ట్వీట్లకు ఎలాంటి సంబంధమూ ఉండదు! వాటిని ఎవరో ఘోస్ట్ రైటర్ పోస్టు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఏర్పడిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి అయినా లోకేష్ ను వాగ్ధాటి విషయంలో తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతూ ఉండవచ్చు. మరి లోకేష్ ను యండమూరి ఏ మేరకు తీర్చిదిద్దుతారో ముందు ముందు తెలుస్తుందని పరిశీలకులు అంటున్నారు.