Begin typing your search above and press return to search.
పయ్యావులను ఎంపిక చేసి బాబు తప్పు చేశారా?
By: Tupaki Desk | 26 July 2019 7:32 AM GMTతప్పులు చేయువాడు చంద్రబాబు అన్న నానుడిని అంతకంతకూ నిజం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తన ఐదేళ్ల పాలనలో తన సామాజిక వర్గానికి వేసిన పెద్ద పీట.. ఏపీలోని మిగిలిన సామాజిక వర్గాలన్ని దూరమైన పరిస్థితి. ప్రతి విషయంలోనూ తాను నేతృత్వం వహించే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటం ఆంధ్రోళ్లలో అసంతృప్తి పీక్స్ కు చేరింది. ఓట్లు వేసేది మేము.. పదవులు మాత్రం మీకా? అన్న క్వశ్చన్ అందరి నోటా వినిపించటమే కాదు.. చివరకు ఎన్నికల ఫలితాల్లో దాని ప్రభావం భారీగా పడిందన్న మాట పలువురి నోట వినిపించింది.
అధికారానికి దూరమైన తర్వాత అయినా.. తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గించి.. కీలకమైన పదవుల్ని సామాజిక న్యాయం సూత్రానికి తగినట్లుగా కేటాయించకపోవటం మారని బాబును చెప్పకనే చెప్పేస్తుంది. మాటల్లో మాత్రం కాపులు.. వెనుక బడిన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పినప్పటికీ.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.
దీనికి తగ్గట్లే తాజాగా ఎంపిక చేసిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి నియామకం చూస్తే.. విషయం అర్థమయ్యే పరిస్థితి. మిగిలిన నేతల్ని పక్కన పెట్టి.. తన సామాజిక వర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ కు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవికి ఎంపిక చేయటం చూస్తే.. బాబు మాటలకు చేతలకు మధ్యనున్న వ్యత్యాసం ఇట్టే అర్థం కాక మానదు. మాటలు.. చేతలు సింక్ కానంత వరకూ బాబును నమ్మకపోగా.. ఆయన మీద వ్యతిరేకత మరింత పెరగటం ఖాయమని చెప్పకతప్పదు.