Begin typing your search above and press return to search.

చంద్రబాబు విన్న పాలు..ఈసీ ఏం చెబుతుందో!

By:  Tupaki Desk   |   2 May 2019 5:30 PM GMT
చంద్రబాబు విన్న పాలు..ఈసీ ఏం చెబుతుందో!
X
మొన్నటి వరకూ 'ఈసీ ఎవరండీ..' అంటూ మాట్లాడిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు టోన్ మార్చారు. తను ముఖ్యమంత్రిని అంటూ - తనను అడ్డుకోవడానికి - తను సమీక్షలు నిర్వహించకూడదు అనడానికి ఈసీ ఎవరంటూ ప్రశ్నించేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట తీరులో మార్పు చూపించారు.

ఈసీ ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన విన్నపాలు పెడుతున్నారు. తనకు అనుమతులు ఇవ్వాలని అంటూ బాబు ఈసీని కోరుతున్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని తను అనుకుంటున్నట్టుగా దానికి అనుమతిని ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఈసీని కోరడం ఆసక్తిదాయకంగా మారింది.

తనను అడ్డుకునే హక్కు ఈసీకి లేదంటూ వాదించి, ఈసీపై మొన్నటి వరకూ చంద్రబాబు నాయుడు దుమ్మెత్తి పోశారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనే అనుమతి కోరుతూ ఉన్నారు.

ఇక చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కూడా గొప్పలు చెప్పుకోవడం మారలేదు. గతంలో హుదూద్ తుఫాన్ ను ఎదుర్కొన్నట్టుగా, తిత్లీ తుఫాను ఎదుర్కొన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఈ ఎదుర్కోవడం ఏమిటో ఆయనకే తెలియాలి. తుఫాన్ వస్తే తీర ప్రాంత ప్రజలు అల్లడిపోతారు. ఎన్ని ప్రభుత్వాలు, ఎంత వ్యవస్థ వచ్చినా వీళ్లేమీ చక్రాలు అడ్డు వేయలేరు.

కొద్దో గొప్పో సహాయ కార్యక్రమాలను నిర్వహించగలరు, కొందరికి కాపాడగలరు. అయితే విరుచుకుపడే ప్రకృతి విపత్తులను ప్రజలు ఎదుర్కొనాల్సిందే. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తనే తుఫానులను ఎదుర్కొన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

తనకు తుఫానులను ఎదుర్కొన్న అనుభవం ఉందంటూ - ఇప్పుడు తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఇవ్వాలంటూ బాబు కోరుతున్నారు. తుఫాన్ నేపథ్యంలో ఒడిశాలో మూడు జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ఎత్తేసినట్టుగా ఏపీలోనూ కోడ్ ఎత్తేయాలని బాబు కోరుతున్నారు! మరి దీనికి ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో!