Begin typing your search above and press return to search.
ప్రొటెం స్పీకర్..బాబును మించిన అర్హులు లేరంతే
By: Tupaki Desk | 29 May 2019 5:30 PM GMTనవ్యాంధ్రలో సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు అవకాశాలైతే దండిగానే ఉన్నాయి. అయితే గెలిచిన జగన్ అందుకు ఊ కొట్టాలి. ఓడిన చంద్రబాబు కూడా జైకొట్టాలి. ఈ రెండూ జరిగితే మాత్రం చంద్రబాబు పేరిట అరుదైన రికార్డు నమోదు కావడమే కాకుండా అందుకు దోహదపడ్డ జగన్ కూడా రికార్డు పుటల్లోకి ఎక్కుతారు. ఇప్పటికే ఈ విషయంపై మనం ఓ సారి ప్రస్తావించుకున్నా... ఇప్పుడు దానిపైనే అంతా చర్చించుకుంటున్నారు. అయినా ఆ విషయం ఏమిటంటే... ఏపీ శాసనసభకు కొత్త సభ్యులు ఎన్నికయ్యారు కదా.. వారితో ప్రమాణం చేయించే ప్రొటెం స్పీకర్ గా ఎవరికి అవకాశం దక్కుతుంది? సభలో సీనియర్ మోస్ట్ గా ఉన్న టీడీపీ అధినేత - ఏపీ శాసన సభలో కొత్తగా ప్రతిపక్ష నేత హోదాలోకి దిగిపోతున్న నానా చంద్రబాబునాయుడుకు ఈ పదవికి తగిన అర్హతలన్నీ ఉన్నాయి.
సభలో ఈ పదవికి తగిన అర్హతల విషయంలో చంద్రబాబును మించిన నేత లేరనే చెప్పాలి. ఎందుకంటే... ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇన్ని సార్లు సభకు ఎన్నికైన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. ఆరు పర్యాయాలు సభకు ఎన్నికైన వారు ఇటు అధికార వైసీపీలో ముగ్గురేసి ఎమ్మెల్యేలుంటే...విపక్ష టీడీపీలో ఓ ఎమ్మెల్యే ఉన్నా... చంద్రబాబు మాదిరి ఏకంగా ఎనిమిది సార్లు సభకు ప్రాతినిధ్యం వహించిన వారు లేరు. ప్రొటెం స్పీకర్ అంటేనే... సభలో సీనియర్ గా ఉన్న నేతకు దక్కే అవకాశం. అయితే అధికార పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ నే ఈ పదవికి ఎన్నికవుతూ వస్తున్న పరిస్థితులే ఎక్కువ. గత సభలో అధికార పార్టీగా టీడీపీ ఉండగా... ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించారు.
అయితే విపక్షానికి చెందిన సీనియర్ మోస్ట్ కు ఈ పదవి దక్కిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. తెలంగాణ తోలి సభలో సీఎం కేసీఆర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి... విపక్షానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డికి ఈ పదవికి ఎంపిక చేశారు. అంతకుముందు ప్రొటెం స్పీకర్ గా విపక్షానికి చెందిన నేతలను ఎంపిక చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అయితే కేసీఆర్ మొదలెట్టిన కొత్త సంస్కృతిని జగన్ కూడా కొనసాగించాలని నిర్ణయిస్తే మాత్రం ఏపీ శాసన సభ సరికొత్త రికార్డును సృష్టించనుంది. సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ప్రొటెం స్పీకర్ గా కూర్చోబెట్టి... అధికార పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 174 మంది చేత ప్రమాణం చేయించడమంటే మాటలు కాదు కదా. ఈ విషయంపై ఇప్పటికే వైసీపీ చర్చ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే... రికార్డు సృష్టించడం ఖాయమేనని - బాబును ఆ పదవిలో కూర్చోబెడదామని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు చెప్పారట.
అయితే ఈ ప్రతిపాదనపై ఇప్పటిదాకా జగన్ నోరు విప్పలేదని తెలుస్తోంది. అయితే జగన్ ఓకే అన్నా చంద్రబాబు అందుకు సరేనంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇటు జగన్ - అటు చంద్రబాబు ఒప్పుకుంటారా? అన్నది నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక జగన్ ఇందుకు ఓకే అన్నా... చంద్రబాబు నో అంటే మాత్రం... రెండు పార్టీల తరఫున ముగ్గురేసి సభ్యులు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారున్నారు. వారిలో వైసీపీ విషయానికి వస్తే... కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి - నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి - అదే జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు ఉన్నారు. టీడీపీ విషయానికి వస్తే... తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.