Begin typing your search above and press return to search.
జనసేనపై చంద్రబాబు సానుభూతి.. ఫ్రీగా!
By: Tupaki Desk | 14 Aug 2019 5:29 PM GMTజనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేయడం, ఆ వెంటనే విడుదల చేయడం పై చంద్రబాబు నాయుడు స్పందించేశారు. విశేషం ఏమిటంటే ఈ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు జనసేన ఎమ్మెల్యే మీద సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
జనసేన ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించిన పరిణామాలు అందరికీ తెలిసినవే. పేకాట గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వారిని విడిపించడానికి రాపాక మనుషులు రంగంలోకి దిగడం, వారికి ఎస్సై గట్టిగా సమాధానం ఇవ్వడం.. దీంతో రాపాక స్వయంగా రంగంలోకి దిగి పోలిస్ స్టేషన్ మీదకు దాడికి దిగడం తెలిసిన సంగతులే.
అందుకు సంబంధించిన వీడియోలను రాపాక వరప్రసాద్ అనుచరులే వైరల్ చేశారు. తమ శక్తిని చాటుతున్నట్టుగా వాళ్లు ఫీలయ్యారు. అయితే పోలీసులు రాపాక పై కేసులు నమోదు చేశారు. పోలిస్ స్టేషన్ పైకే రాళ్ల దాడికి దిగడం అంటే మాటలు కాదు కదా!
ఇలాంటి నేపథ్యంలో రాపాక అరెస్టు వరకూ వచ్చింది వ్యవహారం. ఆయనే వెళ్లి లొంగిపోయారు, వెంటనే బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన దీనిపై పెద్దగా రియాక్ట్ కాలేదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రియాక్ట్ అయిపోయారు. రాపాక అరెస్టుపై సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యే విషయంలో ఒక్కో న్యాయం చేస్తున్నారని - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయలేదని, రాపాకను మాత్రం అరెస్టు చేశారంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఈ అంశాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు రెండు రకాలుగా మాట్లాడారు. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడటం, రెండు జనసేనపై ప్రేమ ప్రకటన చేయడం. జనసేనతో పొత్తు కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారనే టాక్ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈ మాటలు ఆ విశ్లేషణలకు మరింత ఊతం ఇస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.