Begin typing your search above and press return to search.

టీడీపీలో గోల గోల‌!... హైటెన్ష‌న్‌ లో బాబు!

By:  Tupaki Desk   |   20 Feb 2019 4:24 AM GMT
టీడీపీలో గోల గోల‌!... హైటెన్ష‌న్‌ లో బాబు!
X
ఓ వైపు వ‌రుస‌గా పార్టీ మారుతున్న నేత‌లు నేరుగా విప‌క్ష వైసీపీలో చేరిపోతుంటే... నేత‌ల‌ను ఎలా నిలువ‌రించాలో అర్థం కాక టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు త‌ల ప‌ట్టుకున్నారు. వ‌రుస‌గా త‌గులుతున్న ఈ షాకుల నుంచి తేరుకోక ముందే.... ఇప్పుడు సొంత పార్టీలోనే టికెట్ల గోల మొద‌లైపోయింది. మొత్తంగా ఇప్పుడు చంద్రబాబుకు మ‌ద్దెల ద‌రువు మొద‌లైపోయింద‌ని చెప్పాలి. పార్టీ నుంచి వ‌రుస‌గా వెళ్లిపోవ‌డంతో పాటు వారంతా నేరుగా విప‌క్ష వైసీపీలో చేరుతుండ‌టంతో చంద్ర‌బాబు విప‌రీత టెన్ష‌న్ లో ప‌డిపోయారు. అదే స‌మ‌యంలో ఈ నేత మాకొద్దంటూ పార్టీ కార్య‌క‌ర్త‌లు గోల పెడుతున్న వైనం ఆయ‌ను మ‌రింత‌గా టెన్ష‌న్‌ కు గురి చేస్తోంది. మొత్తంగా బాబు ఇప్పుడు హైటెన్ష‌న్ లో ప‌డిపోయారు. పార్టీ నేత‌ల‌ను ఎలా నిలువ‌రించాలో తెలియ‌క ఆయ‌న నానా పాట్లు ప‌డుతుంటే.. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మాకొద్దంటూ కార్య‌కర్త‌ల నుంచి వినిపిస్తున్న స‌రికొత్త గోల నిజంగానే బాబుకు దిమ్మ‌తిరిగేలా చేస్తోంది. ఈ త‌ర‌హా గోల‌లు నేడు ఒకే రోజు నాలుగు చోట్ల నుంచి వినిపించ‌డం టీడీపీలో ఎంత‌టి దారుణ ప‌రిస్థితి ఉందో ఇట్టే చెప్ప‌క‌నే చేప్పేస్తోంది.

ఆ గోల‌ల గురించి ఓ సారి ప‌రిశీలిస్తే.. న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తికి కూత‌వేటు దూరంలోని తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం కార్య‌క‌ర్త‌లు నిన్న మ‌ధ్యాహ్నం ఏకంగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు త‌ర‌లివ‌చ్చారు. ప్ర‌స్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌ కు ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌వ‌ద్ద‌ని - త‌మ మాట కాద‌ని ఆయ‌న‌కే టికెట్ ఇస్తే.... పార్టీని ఓడించ‌డానికి కూడా వెనుకాడేది లేద‌ని వారు తేల్చి చెప్పారు. అయితే ఈ విష‌యాన్ని తెలుసుకున్న శ్రావ‌ణ్ వర్గం కూడా ఎంట్రీ ఇచ్చేసి వైరి వ‌ర్గంలో ఘ‌ర్ష‌ణ‌కు దిగింది. దీంతో అమ‌రావ‌తి ప‌రిధిలో ర‌చ్చ‌ర‌చ్చ జ‌రిగింది. ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అక్క‌డి నుంచి మంత్రి జ‌వ‌హ‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. జ‌వ‌హ‌ర్ అనుకూల‌ - ప్ర‌తికూల వ‌ర్గాలుగా అక్క‌డి కార్య‌క‌ర్త‌లు చీలిపోయారు. ప‌ట్ట‌ణంలో ఇప్పుడు టీడీపీకి రెండు కార్యాల‌యాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌వ‌హ‌ర్‌ కు టికెట్ ఇవ్వ‌వ‌ద్ద‌ని వ్య‌తిరేక వ‌ర్గం నాలుగు రోజుల క్రితం భారీ ర్యాలీ నిర్వ‌హించింది. దానికి ప్ర‌తిగా నేడు జవ‌హ‌ర్ అనుకూల వ‌ర్గం పెద్ద సంఖ్య‌లో కార్ల‌తో ఏకంగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు బ‌య‌లుదేరింది. దీంతో అమ‌రావ‌తిలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఈ రెండు గోల‌లు ఓ వైపు కాక‌ను పుట్టిస్తుంటే... తూర్పు గోదావ‌రి నుంచి మ‌రో కొత్త గోల ఎంట్రీ ఇచ్చింది. జిల్లాలోని కాకినాడ ఎంపీగా ఉన్న తోట న‌రసింహం.. నేడు చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. ఈ ద‌ఫా తాను ఎంపీగా పోటీ చేయ‌డం సాధ్యం కాద‌ని - త‌న కోటాలో త‌న స‌తీమ‌ణికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాల‌ని ఓ కొత్త ప్ర‌తిపాద‌న పెట్టారు. ఇంత‌టితో ఆగ‌ని న‌ర‌సింహం.. త‌న స‌తీమ‌ణికి జ‌గ్గంపేట సీటు ఇవ్వాల‌ని ఆయ‌న విన్న‌వించారు. జ‌గ్గంపేట‌లో ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీనియ‌ర్ నేత జ్యోతుల నెహ్రూ ఉన్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ టికెట్ పై పోటి చేసి ఆ త‌ర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో ఈ ద‌ఫా టికెట్ ఆయ‌న‌కే ఇవ్వ‌క త‌ప్ప‌దు. అయితే న‌ర‌సింహం దీనిపై చంద్ర‌బాబు స‌మాధానాన్ని ముందే ఊహించి.. గ‌తంలో జ‌గ్గంపేట నుంచి తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని - అక్క‌డ త‌న‌కు మంచి ప‌ట్టుంద‌ని కూడా ముందే చెప్పేశారు. దీంతో ఏమీ చెప్పలేని స్థితిలో ప‌డిపోయిన చంద్ర‌బాబు....చూద్దాం - చేద్దాం అంటూ అప్ప‌టిక‌ప్పుడు స‌ర్ది చెప్పి పంపారు.

ఇదిలా ఉంటే... న‌ర‌సింహం భేటీ ముగియ‌గానే... క‌డ‌ప జిల్లాకు చెందిన పార్టీ సీనియ‌ర్ నేత పాల‌కొండ‌రాయుడు బాబు వ‌ద్ద‌కు వ‌చ్చార‌ట‌. జిల్లాలోని రాయచోటి ఎమ్మెల్యే సీటును ఈ ద‌ఫా తన కుమారుడికి ఇవ్వాలని ఆయ‌న ఓ ప్ర‌తిపాద‌న పెట్టారు. ఇప్ప‌టికే పాల‌కొండ‌రాయుడు కుమారుడికి చంద్ర‌బాబు టీటీడీ బోర్డు మెంబ‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. టికెట్ నిరాక‌రించే వ్యూహంలో భాగంగానే టీటీడీ బోర్డు ప‌ద‌వి ఇచ్చార‌న్న భావ‌న‌తోనే చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆయ‌న‌... టీటీడీ బోర్డు మెంబ‌ర్ ప‌ద‌వి త‌మ‌కు వ‌ద్ద‌ని బాబు ముఖం మీదే చెప్పేశార‌ట‌. ఇన్ని స‌మ‌స్య‌లు ఒకేసారి ఎదురు కావ‌డంతో చంద్ర‌బాబు అంద‌రి వాద‌న‌లు వింటూ. ఆందోళ‌న‌లు చూస్తూ త‌ల ప‌ట్టుకుని కూర్చున్నార‌ట‌. మ‌ద్దెల ద‌రువు అంటే ఇదే మ‌రి. ఈ త‌ర‌హా స‌రికొత్త గోల‌లు ఇంకెన్ని వస్తాయో చూడాలి. వాటికి బాబు ఏ త‌ర‌హా ప‌రిష్కారం చూపుతారో - అస‌లు చూప‌కుండానే చేతులెత్తేస్తారో చూడాలి.
--