Begin typing your search above and press return to search.
ఒంగోలు ఎంపీ సీటు!... టీడీపీకి అభ్యర్థులే లేరే!
By: Tupaki Desk | 27 Feb 2019 2:30 PM GMTఏపీలో అధికార పార్టీగా టీడీపీ చాలా పటిష్టంగానే ఉంటుందని అంతా అనుకుంటారు. అయితే అందుకు భిన్నమైన పరిస్థితిలో ఇప్పుడు టీడీపీ నానా అవస్థలు పడుతోంది. అది కూడా సరిగ్గా ఎన్నికల సమయం ఆసన్నమయ్యే సరికి ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఈ వరుస దెబ్బలకు డంగైపోయిన ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... అసలు తాను తీసుకుంటున్న నిర్ణయాలు ఏ తరహా ఫలితాలు ఇస్తాయన్న విషయంపై ఆలోచన కూడా చేయకుండానే ముందడుగు వేస్తున్నారు. ఫలితంగా చాలా సందర్భాల్లో ఈ నిర్ణయాల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని సొంత పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితికి అద్దం పట్టేలా తయారైంది ఒంగోలు ఎంపీ సీటు దుస్థితి. గడచిన ఎన్నికల్లో బడా పారిశ్రామికవేత్త మాగంటి శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ బరిలోకి దించినా... వైవీ సుబ్బారెడ్డితో వైసీపీ ఘన విజయం సాధించింది.
ఇప్పుడు కూడా అక్కడ వైసీపీని కాదని విజయం సాధించడం ఏ ఒక్కరి తరం కాదట. ఈ మాటేదో విపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పిన మాటలు ఎంతమాత్రం కాదు. స్వయానా గడచిన ఎన్నికల్లో అక్కడ ఓటమి చవిచూసి... ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకుని, ఇప్పుడు కూడా అదే సీటు నీదేనంటూ పార్టీ అధిష్ఠానం నుంచి బంపరాఫర్ కొట్టేసిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పిన మాటే. ఈ సీటులో ఈ దఫా తాను పోటీ చేయలేనంటూ ఇప్పటిక చేతులు ఎత్తేసిన మాగుంట... అక్కడ వైసీపీ ఎంత బలంగా ఉందో ఇట్టే చెప్పేశారు. ఎంపీ సీటు కోసం ఏకంగా పార్టీ మారేందుకు కూడా సిద్ధమైన మాగుంట... ఎందుకనో గానీ ఆ తర్వాత వెనకడుగు వేశారు. ఆర్థికంగా పిచ్చ స్ట్రాంగ్ అయిన మాగుంటనే అక్కడ పోటీకి ససేమిరా అంటూ ఉంటే... మరి అక్కడ పోటీకి దిగే అభ్యర్థి ఎవరన్న విషయంపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకే చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి - ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు అభ్యర్థిత్వం దిశగా చంద్రబాబు కొత్త తరహా యత్నాలు ప్రారంభించినట్టుగా సమాచారం.
అయితే సాంబశివరావు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లుగా ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే కదా. వైసీపీకి ఫేవర్‌గా ఉండే నేతలు గానీ, అధికారులు గానీ... టీడీపీ వైపునకు వెళ్లరు కదా. మరి సాంబశివరావును ఒంగోలు బరికి సిద్ధం చేసేది ఎలా? అన్న కోణంలో చంద్రబాబు తనదైన మంత్రాంగం నెరపుతున్నారట. ఈ క్రమంలోనే సాంబశివరావుకు టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పార్టీ టికెట్ పై పోటీకి సిద్ధమైతే... ఒంగోలు ఎంపీ సీటును కేటాయించడంతో పాటుగా ఎన్నికల్లో ఖర్చు మొత్తం పార్టీనే పెట్టుకుంటుంది అని ఆయనకు సమాచారం పంపారట. అయితే వైసీపీ అంటే మంచి అభిప్రాయం ఉన్న సాంబశివరావు ఆ ప్రతిపాదనను విననట్టుగానే వ్యవహరించారని వినికిడి. మొత్తంగా ఓ అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఇప్పుడు తన పాలనలోని ఓ ఎంపీ సీటుకు కనీసం అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉందంటే... టీడీపీ ఫ్యూచర్ ఏమిటో ఇట్టే కనిపిస్తున్నట్టే కదా.