Begin typing your search above and press return to search.
అలీ - బాబు.. ఎవరికి ఎవరు ఝలక్ ఇవ్వనున్నారు?
By: Tupaki Desk | 10 March 2019 5:00 AM GMTఎలాగైనా ఈ సారి ఎన్నికల బరిలో నిలవడమే కాదు, గెలిచి మంత్రి కూడా అయిపోవాలి అనేది నటుడు అలీ కోరిక. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ గానే ఒప్పేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో తను దశాబ్దాలుగా పని చేస్తున్నట్టుగా, పార్టీలో కార్యకర్తగా పని చేసినట్టుగా.. అలా ఎన్నాళ్లు అని.. మంత్రి అయిపోవాలని ఉందని అలీ చెప్పాడు. అందులో భాగంగా అలీ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత జగన్ ను వెళ్లి కలిశారు. మధ్యలో పవన్ కల్యాణ్ ను కూడా వెళ్లి కలిశారు.
అయితే పవన్ పార్టీలో చేరేందుకు అలీ రెడీగా లేరట. అదెందుకో కానీ..అయితే తెలుగుదేశం పార్టీ - కాకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అలీ అనుకుంటున్నారట. అలీ వెళ్లి జగన్ ను కలవగానే చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. సినిమా వాళ్ల ద్వారా అలీని పిలిపించుకుని మాట్లాడారు. దీంతో అలీ తెలుగుదేశంలోకి చేరతారు అనే ప్రచారం మొదలైంది.
ఇక ఈ మధ్యనే అలీకి సన్మానం జరిగితే.. దానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అలీని సన్మానించారు. తద్వారా అలీని మళ్లీ దగ్గర చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో అలీ విజయవాడ తూర్పు సీటు పరిధిలో తన ఓటును కూడా నమోదు చేయించుకున్నారు. దీంతో.. ఆయనకు ఆ సీటు నుంచి టీడీపీ టికెట్ ఖరారు అయినట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే తెలుగుదేశం పార్టీలో ఏదీ ఖరారు కానట్టే అని, అన్నీ లీకులు మాత్రమే అని స్పష్టం అవుతోంది. అలీకి అసెంబ్లీ టికెట్ విషయంలో స్థానిక టీడీపీ నేతల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. అలీ స్థానికేతరుడు అని మైనారిటీకే టికెట్ ఇవ్వాలని అనుకుంటే.. స్థానిక మైనారిటీ నేతకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారట.
అలాగే ఇతర సామాజికవర్గాల నేతలు కూడా ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో అలీకి టికెట్ వ్యవహారం మళ్లీ మొదటకు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అలీ కూడా బాబుకు ఝలక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని.. టికెట్ దక్కని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరడానికి అలీ రెడీ అవుతున్నారట! మరి అలీ, చంద్రబాబుల్లో ఎవరికి ఎవరు ఝలక్ ఇచ్చుకుంటారో!