Begin typing your search above and press return to search.
‘దేశం’లోనే సీనియర్ పొలిటీషియన్..ధైర్యం మాత్రం సున్నా
By: Tupaki Desk | 15 March 2018 5:31 PM GMTతాను మైకు పట్టుకున్నా - తన ఎదురుగా ఎవరు మైకు పెట్టినా చంద్రబాబు తన నలభయ్యేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని వివరించేస్తారు. దేశ రాజకీయాల్లో తన కంటే సీనియర్ ఎవరూ లేరంటారు. మోదీ హవా మొదలవడానికి ఎంతో ముందే తాను ఎన్డీయే కన్వీనర్ ని అని గుర్తు చేస్తారు. నేషనల్ ప్రంట్ - యునైటెడ్ ఫ్రంట్ లను తానే నడిపించానంటారు. దేవెగౌడను తానే ప్రధానిని చేశాననీ చెప్పుకొంటారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వెరీ వెరీ ఇంపార్టెంటు ప్రశ్నలా పదేపదే చదువుతుంటారు. మరి.. అంత సీనియర్ అయిన చంద్రబాబు కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు జంకుతున్నట్లు.. తాను బచ్చాలా ట్రీట్ చేసే జగన్ అవిశ్వాసం పెడితే మద్దతివ్వడానికి ఎందుకు సిద్ధపడినట్లు? ఈ ప్రశ్నకు సమాధానం చంద్రబాబే చెప్పాలి.
చంద్రబాబు తన గురించి తాను ఎన్ని గొప్పలు చెప్పుకొంటారో.. ప్రతిపక్ష నేత జగన్ గురించి అంతేస్థాయిలో చిన్నచూపు మాటలు విసురుతారు. జగన్ తొలిసారి ఎమ్మెల్యే అంటూ తీసి పడేస్తుంటారు. కానీ.. ఇప్పుడు అదే జగన్.. మోదీపై అవిశ్వాసం పెడుతుంటే తప్పని సరి పరిస్థితుల్లో తోక పట్టుకుని నడవడానికి సిద్ధపడుతున్నారు.
అవును.... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ రేపు అవిశ్వాస తీర్మానం పెడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ట్వీట్ చేసిన తరువాత చంద్రబాబు తప్పనిసరై స్పందించారు. ఏపీ హక్కుల కోసం ఎవరు పోరాడినా వారికి సహకరిస్తామని అన్నారు. అయితే... అవిశ్వాసం పెట్టేవాళ్లు లాలూచీ పడితే చరిత్ర హీనులవుతారని అసెంబ్లీలో అన్నారు.
అయితే... తాను వీరుడిని శూరుడిని అని బీరాలు పలికే చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేస్తుండడంతోనే ప్రజల ముందు పలుచన కాకుండా మద్దతిస్తున్నారని.. లేదంటే మద్దతిచ్చే ధైర్యం కూడా చేయలేరన్న విమర్శలొస్తున్నాయి.