Begin typing your search above and press return to search.
అగ్రిగోల్డ్ అంటే.. బాబుకు అదేదో గుర్తుకొచ్చిందే?
By: Tupaki Desk | 24 March 2017 4:22 AM GMTఏపీ అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. మొదలైన విషయానికి ఏ మాత్రం పొంతన లేకుండా.. ఆ ఇష్యూతో సంబందం లేని విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. విషయాల్ని పక్కదారి పట్టిస్తున్న ఏపీ అధికారపక్ష తీరు చూస్తే అవాక్కుఅవ్వాల్సిందే. స్పీకర్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలనుకుంటే..తీసుకోవచ్చు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ.. ఒక అంశంపై సీరియస్ గా చర్చ సాగుతున్న వేళ.. జరిగిపోయిన అంశాల్ని తెరపైకి తెచ్చిన తీరు చూస్తే.. పలు సందేహాలు రావటం ఖాయం.
అగ్రిగోల్డ్ ఇష్యూలో బాబు బ్యాచ్ కు చెందిన కొందరికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని.. ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్ల కంటే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉన్న ఆస్తులు ఉన్న అగ్రిగోల్డ్ ఇష్యూను ఒకకొలిక్కి తీసుకురావటం పెద్ద విషయం కాదు. కానీ.. అందుకు సిద్ధంగా బాబు సర్కారు లేదన్న విమర్శ వినిపిస్తోంది. అగ్రిగోల్డ్ ను సమస్యల చట్రంలో చిక్కుకునేలా చేసి..వారు దాని నుంచి బయట పడలేని విధంగా పరిస్థితుల్ని సృష్టించి.. వారిఆస్తుల్ని కారుచౌకగా కొట్టేయాలన్న ఆలోచనలో ఏపీ అధికారపక్షం ఉందన్న ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి.
ఇలాంటివన్నీ ఉత్తవేనని.. పాలకపార్టీ నేతలకు అలాంటి ఆలోచనలు ఏవీ లేవని.. ఒకవేళ అలాంటివి ఉంటే.. చెక్ చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఏపీ అధికారపక్షం హామీ ఇవ్వాల్సి ఉంటుంది.కానీ.. అందుకు భిన్నంగా మరిన్నిసందేహాలు కలిగేలా.. ముఖ్యమంత్రి తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్ష నేత అగ్రిగోల్డ్ బాధితుల గురించి..అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబందించిన వారి ఆస్తుల్ని.. మంత్రులు కొనుగోలు చేశారన్న ఆరోపణల్ని విపక్ష నేత ప్రస్తావించినంతనే.. ఆ ఇష్యూ పక్కదారి పట్టేలా మరో విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చిన వైనం కళ్లకుకట్టినట్లుగా కనిపిస్తుందన్న అభిప్రాయం తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం బాబు మీద ఉంది. ఆ విషయంలో బాబు చేసే తప్పులు.. ఆయన్ను భవిష్యత్తులో వెంటాడటం ఖాయమన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/