Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు మళ్లీ కాల్ రికార్డు భయం
By: Tupaki Desk | 27 Feb 2016 5:30 PM GMTఓటుకు నోటు కేసులో బకరా అయిపోయిన చంద్రబాబు సొంత రాష్ట్రం ఏపీలోనూ మరోసారి బుక్కయ్యారా అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలతో చేసిన బేరాలకు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పడంతో టీడీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారట. ఆయన మాటల్లో నిజమెంతో తెలియకపోయినా... పొరపాటున ఎవరైనా దొరికేశారా అన్న అనుమానం వారిని తినేస్తోంది. అందుకు కారణం ఉంది.... వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చల కోసం ఒకరు ఇద్దరు కాకుండా ఆయా జిల్లాలకు చెందిన పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో అందరూ జాగ్రత్తగా డీల్ చేసి ఉండకపోవచ్చని... ఎవరైనా ఫోన్లలోనో, నేరుగానో రికార్డింగ్ కు దొరికారేమో అని అనుమానిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నేతల మంతనాలకు సంబంధించిన సంభాషణలను రికార్డు చేశారా అన్న భయం కొందరిలో కనిపిస్తోంది. ఈ విషయంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా టీడీపీ నేతల భయానికి బలం చేకూరుస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఏ టీడీపీ నేత ఏం మాట్లాడారు?.. ఎక్కడ మాట్లాడారు?, ఎంత ఆఫర్ చేశారు? వంటివన్నీ ఆడియో - వీడియో టేపులు కూడా బయటకు వస్తాయని చెప్పడంతో కలకలం రేగింది. అంబటి చెప్పింది నిజమే అయితే పరిస్థితి ఏమిటని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈసారి కూడా ఓటుకు నోటులోలాగా సాక్ష్యాలతో సహా దొరికిపోతే ఇక తమను దేశంలో ఏ నాయకుడు కాపాడే పరిస్థితి ఉండదని భయపడుతున్నారు. కొందరు కీలక ఎమ్మెల్యేలతో చంద్రబాబు కూడా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమై సాక్ష్యాలు బయటకు వస్తే మాత్రం మళ్లీ చంద్రబాబు చిక్కుల్లో పడినట్లే.