Begin typing your search above and press return to search.
చంద్రబాబు ముందుచూపు-1
By: Tupaki Desk | 14 Oct 2015 11:30 AM GMT''చంద్రబాబు మామూలోడు కాదు''.... టీడీపీకి బద్ధ వ్యతిరేకమైన పార్టీలు, చంద్రబాబును నిత్యం విమర్శించే నాయకులు తరచూ ఈ మాట అంటుంటారు. అందులో విమర్శ కంటే ప్రశంసే ఎక్కువ ఉంటుంది. రాజకీయంగా చంద్రబాబుతో విభేదాలున్న వారు కూడా ఆలోచన, ముందుచూపు పరంగా చంద్రబాబు ఈతరం నేతలందరిలోనూ ముందుంటారని చెబుతుంటారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన పరిణామాలు... కొత్త రాజధాని నిర్మాణం... పెట్టుబడులకు ఆహ్వానం వంటి విషయాల్లో చంద్రబాబు వేస్తున్న అడుగులు ఆయన ముందుచూపు.... దార్శినికత... ప్రపంచ పరిస్థితులను అంచనా వేయగలగడం వంటివాటికి తార్కాణాలుగా నిలుస్తున్నాయి.
ప్రధానంగా రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ విషయాల్లో రెండు విషయాలను గమనిస్తే చంద్రబాబు అడ్వాన్స్డ్ ఆలోచనలను అర్థం చేసుకోవచ్చు.. ఏపీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న చంద్రబాబు ఎన్నో దేశాలకు తిరుగుతున్నారు... ఆ దేశ ప్రతినిధులతో సమావేశమమవుతున్నారు... ఏపీలో వారిని తిప్పుతూ ఇక్కడి అనుకూలతలు వివరిస్తున్నారు... జపాన్ - సింగపూర్ - మలేషియా - స్విట్జర్లాండ్ - చైనా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు... ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఆయా దేశీయుల కోసం వీలుగా ఇక్కడ జపాన్ వంటి భాషల్లో కోర్సులనూ అందుబాటులోకి తెస్తున్నారు. ఇన్ని దేశాలు తిరుగుతున్న చంద్రబాబు అమెరికా వైపు మాత్రం వెళ్లడం లేదు ఎందుకు.... దీనికి కారణం తెలిస్తే అవునా అనుకోక మానం.. అలాగే రాజధాని కోసం ఆయన ఎంపిక చేసుకున్న ప్రాంతం కూడా చాలా ప్రత్యేకం.
12 వ శతాబ్దంలో జర్మనీ యువరాజు హెన్రీ కూడా ఇలాంటి ముందుచూపే ప్రదర్శించారని చరిత్ర చెబుతోంది. ఉత్తర జర్మనీ భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ప్రాంతమని హెన్రీ గుర్తిస్తాడు... అక్కడ చేపలవేటపై ఆధారపడి బతికే ప్రజలు నివసించే లూబెక్ అనే ప్రాంతం భౌగోళికంగా ఎంతో అనుకూలమైన ప్రాంతమని... అది అన్ని రకాలు డెవలప్ అవుతుందని అంచనావేసి అక్కడ నగరాన్ని నిర్మించాడు. హెన్నీ అంచనాలకు తగ్గట్లుగానే లూబెక్ఎంతో అభివృద్ధి చెందింది. తన చారిత్రక ప్రాధాన్యతను కాపాడు కుంటూనే ఆధునికత ను సంతరించుకుంది. అనంతరకాలంలో అత్యద్భుత నగరాల వేదికగా ఆ ప్రాంతం మారింది.
జర్మనీ రాజధాని బెర్లిన్నగరం కూడా ఉత్తర జర్మనీ ప్రాంతంలోనే ఉంది. హెన్రీ అంచనాలకు తగ్గట్లుగానే ఉత్తర జర్మనీలో బ్రేవెన్ - హేనోవర్ - బిలేఫెల్డ్ - మనస్టర్ - బ్రూల్స్విక్ - హియల్ - మేగ్డేబర్గ్ - లూబెక్ - రోస్టా అనే 11నగరాలు అభివృద్ధి చెందాయి. హెన్రీ దూరదృష్టికి ఈ ప్రాంతాభివృద్ధి అద్దం పట్టింది.
చంద్రబాబు ఆలోచనా సరళి కూడా ఇదే విధానాన్ని ప్రతిబింబిస్తోంది. జీవనది కృష్ణా పక్కన అత్యద్భుత, చారిత్రక ప్రాధాన్యత కలిగిన అమరావతి భవిష్యత్తులో గొప్ప నగరమవతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. భవిష్యత్ లో ఈ నగరం దేశంలోనే అగ్రగామిగా రూపుదిద్దుకునే అవకాశాలుంటాయంటున్నారు. ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత అనుకూలమైనదిగా చెబుతున్నారు నగర నిర్మాణాల్లో అనుభవమున్నవారు. చంద్రబాబు ముందుచూపు హెన్రీని తలపిస్తోందని... లూబెక్ విషయంలో హెన్రీ సఫలమైనట్లే అమరావతి విషయంలో చంద్రబాబు సఫలమవుతారని చరిత్ర పరిశోధకులు నిపుణులు అంటున్నారు.
-- గరుడ