Begin typing your search above and press return to search.

పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం

By:  Tupaki Desk   |   24 July 2015 8:25 PM GMT
పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం
X
చంద్రబాబు ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా అంతర్జాతీయ స్థాయిలో అద్భుత రాజధానిని నిర్మించనుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకంగా వ్యవహరించింది కేవలం భూమి కావడం విశేషం. రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ముందుకు రావడంతో అందరికీ సానుకూలంగా మారింది. భూమి చేతికి రావడంతో రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వానికి మేలు జరగనుంది. రాజధానిని నిర్మించనున్న సింగపూర్, జపాన్ కంపెనీలకు మేలు జరగనుంది.

రాజధాని నిర్మాణంలో భూమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడి. రైతుల నుంచి సమీకరించిన భూమిని అది తన పెట్టుబడిగా పెడుతోంది. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు రూపాయలు అవుతుందని అంచనా. ఇందులో రూ.30 వేల కోట్లు ఏపీ సర్కారు పెట్టుబడి. ఇది 33 వేల ఎకరాల భూమే. ఇక ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఎకరా కోటి రూపాయలలోపు ఉంది. దానిని తీసుకుని అభివృద్ధి చేసిన భూమిని ప్రభుత్వం ఇవ్వనుంది. దాంతో ఒక్కో రైతుకు నాలుగు నుంచి ఐదు కోట్ల మేరకు లాభం జరగనుంది. ఇక, రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.70 వేల కోట్లను సింగపూర్, జపాన్ ప్రభుత్వాలు పెట్టనున్నాయి. అవి కూడా అభివృద్ధి చేసిన భూమినే కావాలని కోరుతున్నాయి. సింగపూర్ ప్రభుత్వం 3000 ఎకరాలను, జపాన్ 2000 ఎకరాలను కోరుతున్నట్లు సమాచారం.

రాజధానిలో సమీకరించిన భూమి మొత్తం 33 వేల ఎకరాలు అయితే ఇందులో 50 శాతం అంటే 17 వేల ఎకరాలు అభివృద్ధి కార్యక్రమాలకు పోనుంది. మిగిలిన 16 వేల ఎకరాల్లో 7000 ఎకరాలు రైతులకు ఇవ్వనున్నారు. ఇంకా 9 వేల ఎకరాలు మిగులుతుంది. ఇందులో 5000 ఎకరాలను జపాన్, సింగపూర్ లకు ఇస్తే.. మిగిలిన 4000 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు.