Begin typing your search above and press return to search.

బాబుకు..ఏపీ డీజీపీకి చెడిందా?

By:  Tupaki Desk   |   19 July 2015 7:23 AM GMT
బాబుకు..ఏపీ డీజీపీకి చెడిందా?
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆ రాష్ర్ట‌ డీజీపీ జేవీ రాముడికి దూరం పెరిగిందా? గోదావ‌రి పుష్క‌రాల ప్ర‌మాదంలో పోలీసుల‌ను వేలెత్తి చూప‌డంతో పాటు.... మ‌రో కార‌ణం కూడా ఉండా అనే చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాటకు బాధ్యత పోలీసులదేనని అందరివేళ్లూ ఆ శాఖ వైపు చూపుతున్నా యి. వైఫల్యానికి ఎవరిపై వేటు వేస్తారోనన్న ఊహాగానాలూ మొదలయ్యాయి. అదే క్ర‌మంలో రాముడును బాద్యుడిగా చూపెట్టేలా కొన్ని ప‌రిణామాలు ప్రారంభం అయ్యాయ‌ని కొన్ని వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అంతపెద్ద కార్యక్ర మాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తరుణంలో డీజీపీ, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని త‌ద్వారా సీఎంకు ఇబ్బందులు తలెత్తాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పోలీసు వ‌ర్గాలు మాత్రం ఆ సంఘటనతో తమ బాస్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేద‌ని, అదుపుత‌ప్పిన భ‌క్తుల వ‌ల్లే ఆ పరిస్థితి త‌లెత్తిదని అంటున్నారు.

మ‌రోవైపు గ‌త కొద్ది కాలంగా త‌న‌ను పక్కనబెట్టి చంద్రబాబు అంతా తానై వ్యవహరిస్తూ జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లతో నేరుగా మాట్లాడుతూ సూచనలు, ఆదేశాలు చేస్తున్నారని ఈ తీరు డీజీపీకి ఇబ్బందిగా మారుతోంద‌ని స‌మాచారం. శాంతి భద్రతల అంశం సీఎం ప‌రిధిలో ఉన్నప్పటికీ డీజీపీ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పోలీస్‌ బాస్‌ అభిప్రాయం తీసుకోవడం సబబని చెబుతున్నారు. ముఖ్యమంత్రి నేరుగా యూనిట్‌ అధికారులతో మాట్లాడితే, కింద ఏం జరుగుతుందో డీజీపీకి తెలియడం లేదని పోలీసువ‌ర్గాలు అంటున్నాయి. ఈ క్ర‌మంలో మీడియా, పత్రికల ద్వారా తెలుసుకొని డీజీపీ హోదాలో ఎస్పీలను అడిగితే... "సీఎం గారితో చెప్పాం. సార్‌ మాట్లాడారు" అనే సమాధానం వస్తోందని అది రాముడుకు ఇబ్బందిగా ఉంటోంద‌ని స‌మాచారం. మొత్తం సీఎం చూసుకుంటారని, ఆయనతోనే మాట్లాడాలని ఒక్కోసారి కిందిస్థాయి అధికారులకు రాముడు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం, డీజీల మ‌ధ్య దూరం అనే వార్త‌ల్లో నిజం ఉంటే..ఆ ప‌రిస్థితి చ‌క్క‌బ‌డాల్సిన అవ‌స‌రం ఏందేమో. ఎందుకంటే..జోడు గుర్రాల్లాంటి వారు శాంతిభ‌ద్ర‌త‌ల‌కు కీల‌కం కాబ‌ట్టి.