Begin typing your search above and press return to search.
బాబుకు తెలుగు కూడా అర్థం కాదా?
By: Tupaki Desk | 24 Jan 2017 4:35 AM GMTఎంత చదువుకున్నా.. ఎన్నితెలివితేటలు ఉన్నా.. కొంతమందికి కొన్ని మాటలు అర్థం కావు. అదేమీ వారు తప్పు కాదు. ఇంగ్లిషు బాగా వచ్చిన వారైనా ఏదైనా ఫోన్ నెంబరును వరుసగా చెప్పినప్పుడు.. మళ్లీ అదే నెంబర్ ను రిపీట్ చేస్తుంటారు. అదే నెంబరును తెలుగు అంకెల్లో చెబితే మళ్లీ అడగటం ఉండదు. ఎందుకిలా అంటే.. మాతృభాషకు.. పరాయి భాషకు మధ్యనున్న వ్యత్యాసం అదే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వ్యవహారం చూస్తుంటే.. ఆయనకు మాతృభాష అయిన తెలుగులో చెప్పిన మాటలు కూడా అర్థం కావట్లేదన్నది స్పష్టమవుతోంది.
జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఏపీ యువత రిపబ్లిక్ డే రోజున విశాఖలో ఆర్కేబీచ్ దగ్గర మౌన దీక్షను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండటం తెలిసిందే. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తూ ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ఈ వ్యవహారంతో ఇరుకున పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రమైన మాటల్ని చెబుతున్నారు. ప్రత్యేక హోదాకు.. జల్లికట్టుకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన మాటలు విన్న వారికి మైండ్ బ్లాక్ అయ్యే మాటల్ని బాబు చెబుతున్నారు. ‘‘తమిళనాడులో జల్లికట్టు కోసం ఉద్యమించినట్టు ప్రత్యేక హోదా కోసం మీరెందుకు ఉద్యమించరు? అని కొందరంటున్నారు. జల్లికట్టుకు.. దీనికి ఏమైనా పోలిక ఉందా? జల్లికట్టును మా ఊళ్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అదో గ్రామీణ క్రీడ. జంతుహింస జరుగుతోందని సుప్రీం వద్దంది. అది మా వారసత్వ క్రీడంటూ తమిళనాడులో ఆందోళన చేస్తున్నారు. జల్లికట్టుకు.. ప్రత్యేక హోదాకు ముడిపెట్టి పోరాటం చేయమనటంలో అర్థం లేదు’’అంటూ బాబు నోటి నుంచి వచ్చిన మాటల్ని వింటే.. బాబుకు తెలుగును అర్థం చేసుకోవటం రాదా? అన్న సందేహం కలగకమానదు.
జల్లికట్టుపై తమిళులు మెరీనాబీచ్ లో ఏ విధంగా అయితే ఆందోళన చేసి.. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారో.. అదేతీరులో ఏపీ యువత కదం తొక్కాలన్నది అసలు ఆలోచన అయితే.. అందుకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా మాటల్ని చెప్పి.. ఇష్యూను సంబంధం లేని వాటితో బాబు ముడి వేయటం కనిపిస్తుంది. బాబు తీరు చూస్తే అనిపించేది ఒక్కటే. అయితే.. తెలుగు ఆయనకు సరిగా అర్థం కాకుండా ఉండనన్నా ఉండాలి. లేదంటే.. అర్థమైనా అర్థం కానట్లుగా వ్యవహరిస్తూ.. విషయాన్ని పక్కదారి అయినా పట్టించే ప్రయత్నంలో అయినా ఉండాలి. ఏది ఏమైనా అసలు విషయాన్ని అడ్డదిడ్డం చేసేసి.. సంబంధం లేని విధంగా ట్విస్ట్ చేసే ఆర్ట్ బాబులో ఎంత ఉందన్నది తాజా వ్యాఖ్యల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/