Begin typing your search above and press return to search.
బాబు అండ్ కో సీక్రెట్ బయటపడాల్సిందే
By: Tupaki Desk | 7 Nov 2017 6:30 AM GMTచంద్రబాబునాయుడు అండ్ కో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? ప్రజలు వాళ్లకు సమస్యలు చెబుతున్నా కూడా.. వాటిని ఎక్కడివక్కడ మరచిపోయి.. పాలన సాగిస్తున్నారా? లేదా - పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు తమ దృష్టికి వస్తున్న సమస్యలను పట్టించుకుంటున్నారా? లాంటి అనేక సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి. అయితే ఆ కోణంలోంచి చూసినప్పుడు వారి సీక్రెట్ కాస్తా ఇప్పుడు బయటపడుతుంది. ‘ఇంటింటికీ తెదేపా’ అంటూ తెలుగుదేశం నడిపించిన ఎపిసోడ్ లో కామెడీ ఎంతో నిజం ఎంతో సీక్రెట్ తేలిపోనుంది.
చంద్రబాబునాయుడు అసెంబ్లీ నిర్వహణకు ఓ వ్యూహరచన మీటింగు పెట్టుకున్నారు. తన పార్టీ వాళ్లను పోగేసుకుని.. ప్రతిపక్షం లేదుగనుక.. నిర్లక్ష్యం వద్దు అంటూ చిన్న క్లాస్ తీసుకున్నారు. దానికి తోడు.. ప్రతిపక్షం వారు సభలో ఉండకపోయినా.. మనం సమస్యలను ప్రస్తావించాలంటూ సభ్యులకు ఓ డైరక్షన్ కూడా ఇచ్చారు. డయల్ 1100 నెంబరుకు ప్రజలు చెప్పిన సమస్యలను సభలో ప్రస్తావించుకోవాలని - అలాగే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో నియోజకవర్గాల్లో తమ పార్టీ నాయకుల దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను సభలో పెట్టాలని ఆయన అన్నారు.
అసలు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ఏమాత్రం జరిగిందో అందరికీ తెలుసు. ఆ కార్యక్రమాన్ని నాయకులు సరిగా పట్టించుకోవడం లేదంటూ.. చంద్రబాబునాయుడే మధ్యలు పలుమార్లు నేతలపై అసహనం వ్యక్తంచేశారు. ఆకార్యక్రమంలో వారు నిజంగానే ప్రజల సమస్యల గురించి తెలుసుకున్నారో లేదా, ఆ పేరు మీద శాసనసభలో పొగడ్తల కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వేచిచూడాలి.
సాధారణంగా తెలుగుదేశం నాయకులు.. ఇంటింటికీ తెలుగుదేశంలో తమకు అద్భుతమైన స్పందన వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న కష్టం చూసి.. రాష్ట్ర ప్రజలంతా కన్నీరు కారుస్తున్నారని.. రకరకాలుగా పొగిడి అధినేతను ముగ్ధుణ్ని చేయడానికే ప్రయత్నిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. నిజానికి ఇంటింటికీ తెదేపాలో పార్టీకి పలుచోట్ల చేదు అనుభవాలు ఎదురయ్యయి. వాటిని దాచిపెట్టి శాసనసభలో మాత్రం పొగడ్తల పర్వం నడిపించే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు.