Begin typing your search above and press return to search.

ముగ్గురు ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు

By:  Tupaki Desk   |   29 March 2017 8:20 AM GMT
ముగ్గురు ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు
X
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైది. ఏప్రిల్‌ 2వ తేదీన కొత్త మంత్రులతో గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రమాణ శ్రీకారం చేయించే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌ నరసింహన్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. ఈనెల 31వ తేదీతో ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ముగుస్తున్నందున 2వ తేదీన మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు చేసినట్టు గవర్నర్‌ తో చెప్పారని టాక్.

మంత్రివర్గంలో ఐదారు మందికి కొత్తగా చోటుదక్కే అవకాశం ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారని తెలుస్తోంది.

* గురువారం శాసనమండలి సభ్యుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న లోకేష్‌ వెనువెంటనే మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది ఖాయమైన బెర్తు

* లోకేష్‌ తో పాటు ఆళ్ళగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ

* తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌

* మైనారిటీ కోటా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్‌

* గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు, విను కొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

ఈ అయిదుగురు పేర్లు ఫైనల్ లిస్టులో ఉన్నాయని.. అయితే గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు మాత్రం ఇంకా చాలామందే ఉన్నారు. భూమా నాగిరెడ్డి బావమరిది మోహన్‌ రెడ్డి సైతం మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అఖిలప్రియకు రాజకీయ అనుభవం లేదని, తనకు అవకాశమిస్తే పార్టీని బలోపేతం చేయడంతో పాటు తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖకు వన్నె తెస్తానని ఆయన ఇటీవల చంద్రబాబును కలిసిన సందర్భంలో చెప్పినట్లు సమాచారం. తెదేపా ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు, గొల్లపల్లి సూర్యారావు, ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు జిల్లాకు చెందిన అమర్‌నాథ్‌రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన పార్థసారధి తదితర పేర్లు కూడా మంత్రులుగా చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.