Begin typing your search above and press return to search.
చంద్రబాబు డిసైడ్ చేశారు....
By: Tupaki Desk | 29 Aug 2015 5:28 AM GMTబెజవాడలో జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముందు జరుగుతున్న ఈ భేటీలో ప్రధాన అంశాలు ఏంటి? కేబినెట్ సమావేశంలో బాబు ఏం చెప్పబోతున్నారు అనే సందేహాలకు ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి.
బెజవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా జరుగుతున్న ఈ కేబినెట్ భేటి లో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా మంతనాలు జరుపుతారని సమాచారం. మరోవైపు పలువురు మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవడం లేదని భావిస్తున్న ముఖ్యమంత్రి... అసెంబ్లీకి పక్కా వ్యూహంతో రావాలని ఇప్పటికే సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన విశేషాల పైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. హోదా సాధ్యం కాదని తేలిపోవడంతో.. ప్యాకేజ్ పై మంత్రులకు వివరించనున్నారు బాబు. అలాగే ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు వాటి ప్రభావంపై చర్చ జరగబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అన్నదానిపై ఓ నిర్ణయానికి రానున్నారు.
ప్రత్యేక హోదా, భూ సమీకరణ, రాజధాని నిర్మాణం, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రభుత్వాస్పత్రుల పనితీరు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు సిద్ధమై మంత్రులు కేబినెట్ భేటీకి వస్తున్నారు. ఏపీలో డీజిల్ పై రెండు శాతం పన్నును తగ్గిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుపై సిద్ధమైన ముసాయిదా బిల్లు కూడా ప్రస్థావనకు రానుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈడీ కేసుల్లో జప్తు అయిన ఆస్తులు కేంద్రానికి కాకుండా రాష్ట్రానికి దక్కేలా చట్టం చేయనున్నట్లు సమాచారం.