Begin typing your search above and press return to search.
బాబు చైనా టూర్; రూ.53వేల కోట్లతో ఒప్పందాలు
By: Tupaki Desk | 28 Jun 2016 5:15 AM GMTవిదేశీ పెట్టుబడులే లక్ష్యంగా.. ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు విదేశీ పర్యటన చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చైనా పర్యటనలో తాను అనుకున్నట్లుగా అడుగులు వేయగలుగుతున్నారు. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు.. కొన్ని భేటీల్లో ప్రజంటేషన్ తో పాటు.. టియాంజిన్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాన ప్రసంగం చేయటం లాంటి కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.
తన రెండో రోజు పర్యటన సందర్భంగా ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ఒక్కరోజులో పూర్తి అయిన ఈ ఒప్పందాల విలువ రూ.53వేల కోట్లు. ఇందులో కృష్ణపట్నం సమీపంలో రూ.10,183కోట్లతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం.. ప్రకాశం జిల్లా దొనకొండలోరూ.10వేల కోట్లతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు.. రూ.36,889 కోట్లతోఅత్యాధునిక భవన నిర్మాణ పరికరాల లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకి సంబంధించిన ప్రాథమిక అవగాహన ఒప్పందాలు పూర్తి అయ్యాయి.
ఈ మూడు ఒప్పందాల్లో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగార ఏర్పాటుకు సంబంధించి చైనాకు చెందిన హాంక్యూ కాంట్రాక్టింగ్ అండ్ ఇంజినీరింగ్ కార్పొరేషన్.. ఇసోమెరిక్ హోల్డింగ్స్.. ఎల్ఈపీఎల్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ వాణిజ్య.. పరిశ్రమల విభాగం ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. 2017 – 18 మధ్య కాలంలో నిర్మాణం మొదలయ్యే ఈ కర్మాగారం కారణంగా 5వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక.. ప్రకాశం జిల్లా దొనకొండలో ఏర్పాటు చేసే అంతర్జాతీయ ప్రారిశ్రామిక పార్కుతో 55 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రూ.10,106.2 కోట్లు.. రెండో దశలో రూ.12,127.6 కోట్లు.. మూడో దశలో రూ.14,148.8 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ఒప్పందాలతో పాటు చైనా.. జపాన్ కు చెందిన పలు పారిశ్రామిక సంస్థల ముఖ్య ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మొత్తంగా చూస్తే తాను చేస్తున్న ప్రయత్నాలతో ఏపీకి భారీ ఎత్తున నిధులు తేవటంలోతాను సక్సెస్ అయినట్లుగా చెప్పుకోవటంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లుగా కనిపించకమానదు. మరి.. భారీగా చెప్పుకుంటున్న ఈ పెట్టుబడులన్నీ నిజంగానే ఏపీకి వచ్చి కార్యరూపం దాలుస్తాయా..?