Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాటకు ఓకే చెప్పిన చంద్రబాబు
By: Tupaki Desk | 7 Jan 2016 10:15 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారు. కొద్దికాలం క్రితం వరకు ఉప్పు-నిప్పుగా ఉన్న చంద్రబాబు - కేసీఆర్ ఇటీవలి కాలంలో సఖ్యతను పాటిస్తున్నారు. ఒకరి కార్యక్రమాలకు ఒకరు వెళ్లడం, ఏకాంత సమావేశాలు, విమర్శల ఊసే మరిచిపోవడం ఇలా ఎన్నో అంశాల్లో ఈ తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయానికి బాబు కూడా మద్దతుగా అదే నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే పొరుగు రాష్ర్టమైన ఏపీలోనూ ఆ డిమాండ్‌లు తెరమీదకు వచ్చాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబును.. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కలసి పరిస్థితి వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎంతో ఆయన చర్చించారు. కాంట్రాక్టు ఉద్యోగులను తప్పకుండా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తరువాత అశోక్ బాబు మీడియాకు తెలిపారు. అయితే కాంట్రాక్టు కొలువులకు తీపికబురు ఇచ్చినట్లే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులకు డీఏపై రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని, హెల్త్ కార్డులపై ఈ నెల 15వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు అశోక్ బాబుతో చెప్పారు.
నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సీఎం కాంట్రాక్టు కొలువులను క్రమబద్దీకరిస్తే... సంక్రాంతి కానుకగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే తీపికబురు ఆంధ్రా వారికి అందించాడని ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.