Begin typing your search above and press return to search.
రైతుల కోసం బాబు కొత్త స్కీం
By: Tupaki Desk | 29 Jun 2016 4:58 AM GMTరైతు రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రుణ మాఫీ ద్వారా లబ్దిపొందని రైతుల్లో వ్యతిరేకత పెరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ రుణ మాఫీపై చేస్తున్న ప్రచారం - క్షేత్రస్థాయిలో చర్చనీయాంశమయిన విషయాన్నిటీడీపీ గమనించింది. వైసీపీ ప్రచారం నిజమని భావిస్తే, రుణమాఫీ కాని రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడితే దాన్ని తొలగించడం కష్టమవుతుందన్న ముందుచూపుతోనే వివరణ పత్రాన్ని విడుదల చేయనుంది. దీంతో అసలు రుణ మాఫీలో తమ తప్పేమీ లేదని, మీ పొరపాట్ల వల్లే మాఫీ కాలేదన్న వాదనతో, ఆరోపణల నుంచి బయటపడే వ్యూహానికి తెరలేపింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఆర్ధిక భారంగా పరిణమించిన రైతు రుణ మాఫీ వ్యవహారంపై - టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బాబు ఎన్నికల్లో ఇచ్చిన రుణ మాఫీ చేయడంలో విఫలమలయిందని, బాబు హామీ వల్ల రుణాలు కట్టని రైతులు ఇబ్బందులు పడుతున్నారని, టీడీపీ రైతులకు ద్రోహం చేసిందని విపక్షాలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. దీనితో రుణమాఫీ కాని రైతుల్లో వ్యతిరేకత పెరిగితే, భవిష్యత్తులో ప్రమాదమని గ్రహించిన టీడీపీ నాయకత్వం.. అసలు రైతులకు ఎందుకు రుణమాఫీ కాలేదో వివరిస్తూ, ఎమ్మెల్యేలు - నియోజకవర్గ ఇన్చార్జిల పేరిట నియోజకవర్గాల వారీగా వివరణ పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో నియోజకవర్గంలో మూడు విడతల్లో ఎంత మాఫీ చేసిందీ, రైతు ఖాతాలో ఎంత జమయిందీ, ఉద్యాన పంటల రుణ మాఫీ కింద ఎంత ఎంతమందికి మాఫీ అయి బ్యాంకు ఖాతాల్లో వేసిన వివరాలను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఎటువంటి హామీ ఇవ్వకపోయినా ఉద్యానవన పంటలు రుణాలకు ఉపశమనం కల్పించింది. మొదటి విడత 20 శాతం రుణ ఉపశమనం పొందిన రైతులకు 4వ వార్షిక వాయిదాలలో మిగిలిన రుణ ఉపశమన మొత్తం 10 శాతం వడ్డీతో సహా ఇస్తోందని తన పత్రంలో వివరించింది.
ఈ పత్రాల్లో భాగంగా వివిధ కారణాల వల్ల నియోజకవర్గంలో రైతులకు రుణవిముక్తి కాకపోవడానికి చింతిస్తున్నామంటూ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వనున్నారు. ‘నియోజకవర్గంలో వివిధ కారణాల రీత్యా నియోజకవర్గంలో.. మంది రైతులకు రుణ విముక్తికాకపోవడానికి చింతిస్తున్నాను. చాలామంది రైతులకు రుణమాఫీ కాకపోవడానికి కారణాలు తెలియని పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితిలో రుణమాఫీ కాని ప్రతి రైతు వెన్ను తట్టి - రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను రైతుకు తెలియచేయాలని నిర్ణయించడంలో భాగమే మా ఈ ప్రయత్నం’ అని పార్టీ ఎమ్మెల్యే ఆ పత్రంలో వివరించనున్నారు. రైతుకు రుణమాఫీ అందకపోవడానికి కారణాలు కూడా అందులో పొందుపరిచారు. ‘‘సరైన ఆధార్ కార్డు సమర్పించలేదు. సరైన రేషన్ కార్డు సమర్పించలేదు. మీరు సరైన ఆధార్ కార్డు సమర్పించలేదు. మీరు తీసుకున్న రుణం పంట రుణం కాదు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ గడువు (1-4-2007 నుంచి 31-3-2014) మధ్య మీరు రుణం పొందలేదు. భూమి వివరాలు పట్టాదారు పాసు పుస్తకాలు/పిపిబి నెంబరు వివరాలు తప్పుగా ఉన్నవి/పొందుపరచలేదు. పంట వివరాలు నమోదు కానందున. బహుళ రేషన్ కార్డులు కలిగి ఉన్నందున/ బహుళ ఆధార్ కార్డులు కలిగి ఉన్నందున. కుటుంబసభ్యుల వివరాలు (రేషన్ కార్డు/ఓటరు కార్డు) ఇవ్వనందున’’ మీకు రుణ మాఫీ కాలేదని పార్టీ ఎమ్మెల్యే - నియోజకవర్గ ఇన్చార్జి రైతులకు తన ‘రుణమాఫీ కాని రైతుకు పత్రం’లో పేర్కొన్నారు.
తాజా పత్రం ద్వారా... రుణ మాఫీలో తమ తప్పు లేదని, సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించకపోవడం వల్ల, మీరు చేసిన పొరపాట్ల వల్లే మాఫీ కాలేదన్న విషయాన్ని ప్రభుత్వం పరోక్షంగానే చెప్పనుంది. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకపోయినా, రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్న ప్రచారంతో నిందను కేంద్రానికి బదలాయించి, రైతుల మెప్పు సంపాదించే వ్యూహం ఈ పత్రం ద్వారా స్పష్టమవుతోంది.