Begin typing your search above and press return to search.

గౌత‌మ్ రెడ్డి వ‌స్తానంటే బాబు నో చెప్తారా?

By:  Tupaki Desk   |   5 Sep 2017 4:33 PM GMT
గౌత‌మ్ రెడ్డి వ‌స్తానంటే బాబు నో చెప్తారా?
X
ఏపీ రాజ‌కీయాల్లో హ‌ఠాత్తుగా పాపుల‌ర్ అయిన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయ‌కుడు గౌత‌మ్‌ రెడ్డి. దివంగ‌త కాపునేత వంగ‌వీటి మోహ‌న‌రంగా పై తీవ్ర వివాదాస్ప‌ద కామెంట్లు చేయ‌డం ద్వారా గౌతంరెడ్డి క‌లక‌లం సృష్టించారు. వంగ‌వీటిని రౌడీగా ముద్ర‌వేయ‌డం ద్వారా గౌతం రెడ్డి చేసిన ర‌చ్చ‌కు చెక్ పెట్టేలా వైసీపీ వెంట‌నే షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అస‌లు గౌతం రెడ్డి ప‌య‌నం ఎటు? వ‌ంగ‌వీటిపై వ్యాఖ్య‌లు చేస్తే వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంటుంద‌ని తెలిసినప్ప‌టికీ గౌతం రెడ్డి ప‌రుష‌మైన ప‌దాల‌తో ఎందుకు మాట్లాడారు? ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏం కాబోతోంది? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌.

రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ ప్ర‌కారం తద‌నంత‌ర ప‌రిణామాల‌పై `స్ప‌ష్ట‌త‌` ఉండే గౌతం రెడ్డి ఈ కామెంట్లు చేశార‌ని అంటున్నారు. గౌతం రెడ్డి మూలాలు క‌మ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాయి. క‌మ్యూనిస్టులు వంగ‌వీటి రంగా తీరును త‌ప్పుప‌డుతుంటారు. అయితే వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ వంగ‌వీటిని త‌ప్పుప‌ట్ట‌డం ద్వారా రాబోయే కాలంలో త‌న‌దారిని చూసుకునేందుకు రూట్ క్లియ‌ర్ చేసుకున్నార‌ని అంటున్నారు. వైసీపీలోకి మ‌ల్లాది విష్ణు ఎంట్రీ ద్వారా త‌న‌కు క‌ష్ట‌కాలం ఉంటుంద‌ని భావించి ఇలాంటి విమ‌ర్శ‌లు చేశార‌ని కూడా ప‌లువురు చెప్తున్నారు. తాజా వివాదం నేప‌థ్యంలో గౌతం రెడ్డి ప‌య‌నం టీడీపీ వైపు అని జోస్యం చెప్తున్నారు.

క‌మ్యూనిస్టు పార్టీ నుంచి కాంగ్రెస్‌ లో చేరి అనంత‌రం వైసీపీలోకి వ‌చ్చిన గౌతంరెడ్డి నెక్ట్ చేర‌బోయే పార్టీ టీడీపీ అని విశ్లేషిస్తున్నారు. అయితే ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం గౌతం రెడ్డి ఎంట్రీకి బ్రేకులు వేస్తార‌ని చెప్తున్నారు. వంగ‌వీటి రంగా అంటే కాపుల‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం ఉన్న సంగ‌తి తెలిసిందే. అలాంటి వ్య‌క్తిని కించ‌ప‌ర్చేలా వ్యాఖ్యానించిన గౌతంరెడ్డిని చేర్చుకోవ‌డం ద్వారా ఆ వ‌ర్గానికి దూర‌మ‌య్యే నిర్ణ‌యం బాబు తీసుకోర‌ని చెప్తున్నారు. ఇప్ప‌టికే కాపు వ‌ర్గాల్లో బాబు అంటే ఒకింత గుస్సా ఉన్న‌పుడు ఒక్క గౌతంరెడ్డి కోసం ఆ వ‌ర్గాని దూర‌మ‌య్యే నిర్ణ‌యం బాబు తీసుకోబోర‌ని అంటున్నారు.