Begin typing your search above and press return to search.
పిల్లల వ్యవహారంగా వదిలేస్తే బాగుండేమో బాబు?
By: Tupaki Desk | 27 Jan 2016 4:42 AM GMTగ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ కావటం తెలిసిందే. దీనికి సంబంధించిన డేట్స్ ను సైతం ఫిక్స్ చేశారు. గ్రేటర్ పరిధిలోని తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఆయన తాజా రూట్ మ్యాప్ ను చూస్తే.. సీమాంధ్రులు అధికంగా ఉన్న ప్రాంతాల్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవటం కనిపిస్తుంది. గ్రేటర్ ప్రచారానికి ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనటం ఎంతవరకు సబబు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీ కూటమి సాధించే సీట్లు ఒక మోస్తరు మాత్రమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పటివరకూ చేసిన సర్వేలన్నీ కూడా గ్రేటర్ పీఠాన్ని గులాబీ దళం చేజిక్కించుకోవటం ఖాయమని తేల్చి చెబుతున్నాయి.
ఇలాంటి సమయంలో గ్రేటర్ ప్రచారంలోకి బాబు ఎంట్రీ సరికాదన్న వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆచితూచి అడుగులు వేస్తూ.. గ్రేటర్ ప్రచారం విషయంలో కాస్త దూరంగా ఉండటం మర్చిపోకూడదు. గ్రేటర్ బాధ్యత మొత్తాన్ని తన కొడుకు కమ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతికి అప్పజెప్పి.. అతడి సామర్థ్యాన్ని మదింపు చేసే పనిలో పడ్డారు. మహా అయితే.. ఒకట్రెండు బహిరంగ సభల్లో కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.
గెలుపు విషయంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ.. గ్రేటర్ ఎన్నికల ద్వారా తన కొడుకు శక్తి.. సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజెప్పే వ్యూహాన్ని కేసీఆర్ పాటిస్తున్నారు. గెలుపు అవకాశాలు పక్కాగా ఉన్నాయని తెలిసిన నేపథ్యంలో.. గ్రేటర్ ఇష్యూలో కేసీఆర్ పెద్దగా జోక్యం చేసుకోవటం లేదు. దీనికి విరుద్ధంగా తమకు బలం పెద్దగా లేదన్న విషయం తెలిసిన తర్వాత కూడా బాబు గ్రేటర్ ప్రచారానికి సిద్ధం కావటం చర్చగా మారింది. తాజాగా ఆయన జరిపే ప్రచారం మొత్తం కూడా సీమాంధ్రులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కావటం ఆయనపై విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు.
తెలంగాణ ప్రాంత ప్రజలపై బాబుకు ప్రేమ లేదని.. ఆయన ప్రాధాన్యత అంతా సీమాంధ్ర ప్రజలేనని.. అందుకు నిదర్శనమే.. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాలంటూ తెలంగాణ అధికారపక్షం విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెడితే.. పార్టీ పరంగా ఇబ్బంది ఎదుర్కోవటం ఖాయం. పార్టీ తెలంగాణ శాఖకు చేయూతను ఇచ్చేందుకు.. తన వంతు సహకారాన్ని అందించేందుకు బాబు ప్రచారం చేస్తున్నా.. దీని వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రచారం చేసిన తర్వాత.. ఫలితాల విషయంలో అనుకున్నట్లు జరగకుంటే బాబు సామర్థ్యాన్ని.. ఆయన పరపతిపై విమర్శలు వల్లువెత్తటం ఖాయం. రెండు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేసిన తర్వాత కూడా ఆశించినంతగా సీట్లు సాధించని పక్షంలో దాని బాధ్యతను బాబు తీసుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అందుకే.. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు దూరంగా ఉంటే మంచిదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న బాబు కుమారుడు లోకేశ్ మీద ఈ భారం మోపటమే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. గ్రేటర్ ఫలితం సానుకూలంగా లేకున్నా..లోకేశ్ కు అదో మంచి అనుభవం అవుతుందే తప్పించి.. ఆయన శక్తిసామర్థ్యాల్నిశంకించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో చినబాబు ఎంత ప్రభావితం చూపించగలరన్న విషయం అందరికి తెలిసిందే. మొత్తంగా చూస్తే.. గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని పిల్లల ఆటగా చంద్రబాబు వదిలేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.