Begin typing your search above and press return to search.
బాబు మళ్లీ పాత ఫార్ములానే ఫాలో అయ్యారు
By: Tupaki Desk | 12 Jan 2016 2:41 PM GMTతెలుగుదేశం అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సీరియస్ గా దృష్టిపెట్టారు. ఏపీలో పరిపాలన చక్కదిద్దడం, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ భాగస్వామ్య పనుల్లో బిజీబిజీ అయిన చంద్రబాబు తాజాగా తెలంగాణలో పార్టీ భవిష్యత్తును నిర్దేశించే బల్దియా పోరుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గ్రేటర్ సీటును గెలుచుకునేందుకు గతంలో సక్సెస్ అయిన ఫార్ములానే బాబు తెరమీదకు తెచ్చారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ ఎస్ తన మంత్రులతో సహా పార్టీ కీలక నేతలందరినీ హైదరాబాద్ లో మోహరించింది. దీంతోపాటు అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించి ఎన్నికల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే నియోజకవర్గానికి ఒక మంత్రిని - ఒక డివిజన్ కు ఒక్కొక్క ఎమ్మెల్యేను బాధ్యుడిగా నియమించింది. మరోవైపు అన్ని పార్టీల వారినీ చేర్చుకుని తన పార్టీని బలోపేతం చేసుకుంటోంది. ఈ వైనాన్ని గమనించిన టీడీపీ నాయకత్వం అందుకు ప్రత్యామ్నాయ ఎత్తుగడకు తెరలేపింది. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో 100 సీట్లపై గురి పెట్టిన టీడీపీ, ఆ లక్ష్య సాధన కోసం ఇప్పటినుంచే అడుగులేస్తోంది. అందులో భాగంగా ఏపీకి చెందిన మంత్రులందరినీ ఎన్నికల ప్రచారంలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. దానితో ప్రచారానికి మరింత ఊపు తీసుకురావాలని భావిస్తోంది. గతంలో బల్దియా ఎన్నికల్లో బాబు సరిగ్గా ఇదే విధానం అనుసరించినందుకే టీడీపీకి 45 సీట్లు వచ్చాయి.
మంత్రులు నియోజకవర్గ బాధ్యులుగా, ఎమ్మెల్యేలు డివిజన్ బాధ్యులుగా ఉంటే, కార్యకర్తల్లో ఉత్సాహంతోపాటు, స్థానిక అధికార యంత్రాంగంలోనూ కొంతమేరకు బాధ్యత ఉంటుందని, అది స్థానిక నాయకులకు కొంత ఆత్మస్థైర్యం ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. గత బల్దియా ఎన్నికల్లో బాబు ఏపీకి చెందిన సీనియర్ నాయకులందరినీ రంగంలోకి దింపింది. కూకట్ పల్లి - శేరిలింగంపల్లి - సనత్ నగర్ - ఎల్బీనగర్ - కుత్బు ల్లాపూర్ - మల్కాజిగిరి - ఉప్పల్ - మలక్ పేట నియోజకవర్గాల్లో మంత్రులు దేవినేని ఉమ - అచ్చెన్నా యుడు వంటి వారితో పాటు పార్టీ సీనియర్ నేతలయిన పయ్యావుల కేశవ్ - ధూళిపాళ్ల నరేంద్ర - బోండా ఉమామహే శ్వరరావు - గోరంట్ల బుచ్చయ్యచౌదరి - నన్నపనేని రాజకుమారి - యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖులను ప్రచారానికి తీసుకురావాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.
ఇలా పెద్ద ఎత్తున నాయకులను మోహరింపచేసి వారి ద్వారా నగరంలోని టీడీపీ అభిమానులు, కార్యకర్తలకు చేరువ అయ్యేందుకు చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేశారు. త్వరలో ఈ మేరకు ఆయా నియోజకవర్గాలు, డివిజన్ల వారిగా చంద్రబాబు బాధ్యతలు అప్పగించనున్నారు.