Begin typing your search above and press return to search.
అలా పిసికించుకోవటం బాబుకే చెల్లుతుందట
By: Tupaki Desk | 9 Nov 2016 3:44 PM GMTబ్లాక్ మనీ మీద ప్రధాని మోడీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గా పలువురు అభివర్ణిస్తున్న వేళ.. ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఓపక్క పెద్ద నోట్లకు మోడీ ఇచ్చిన షాకు.. మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల వేడిలో చాలామంది దృష్టిలో పడలేదు కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను తాను పొగిడించుకునే ప్రయత్నం చేయటం.. అందరూ తన గొప్పతనాన్ని కీర్తిస్తూ పిసికించుకునే వైనం చూస్తే కాసింత ఆశ్చర్యం కలగక మానదు.
పెద్దనోట్లపై మోడీ తీసుకున్న నిర్ణయంపై పలువురు రాజకీయ అధినేతలు కామ్ అయిపోయిన పరిస్థితి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి కొందరు తట్టుకోలేక.. తమ ఆక్రోశాన్ని విమర్శల రూపంలో బయటపెట్టినా.. చాలావరకూ గమ్మున ఉండిపోయారు. ఇలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం భిన్నంగా రియాక్ట్ అయ్యారు. మోడీ తీసుకున్న పెద్ద నోట్ల బ్యాన్ నిర్ణయం వెనుక తన సలహానే ఉందన్న విషయాన్ని ప్రముఖంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు.
పెద్దనోట్లను బ్యాన్ చేయటం ద్వారా నల్లధనానికి చెక్ పెట్టొచ్చన్న వాదనను గతంలోనే తాను పలుమార్లు ప్రస్తావించానని.. ఈ విషయమై ప్రధాని మోడీకి లేఖ రాసిన పాత విషయాన్ని సరికొత్తగా చెప్పుకొని.. తనను అభిమానించే మీడియా సంస్థల్లో హైలెట్ చేసుకోవటం కనిపించింది. మోడీ నిర్ణయానికి సంబంధించిన క్రెడిట్ తీసుకోవటానికి ఏ రాజకీయ అధినేత ప్రయత్నించకున్నా.. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా స్పందించిన తీరు చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. తనను ఎవరూ పొగడకున్నా.. తనను పొగిడించుకునేందుకు ఏం చేయాలన్న విషయం ఆయనకు బాగా తెలుసన్న భావన కలగటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/